అనసూయ.. ఏంటి ఆ మాటలు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రచ్చరచ్చ?

తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు యాంకర్ అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకవైపు బుల్లితెరపై ప్రసారం అయ్యే పలు షోలకు యాంకర్ గా వ్యవహరిస్తూనే మరొకవైపు సినిమాలలో మంచి మంచి అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది.

 Anchor Anasuya Bharadwaj Speech At Darja Movie Pre Release Event , Anasuya, Toll-TeluguStop.com

ఇది ఇలా ఉంటే అనసూయ తాజాగా నటించిన చిత్రం దర్జా.సలీం మాలిక్ దర్శకత్వంలో కామినేని శ్రీనివాస్ సమర్పణలో పి ఎస్ ఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను శివశంకర్ పైడిపాటి నిర్మించారు.ఈ సినిమాలో అనసూయ, సునీల్ ప్రధాన పాత్రలో నటించారు.ఈ సినిమా జులై 22వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న విషయం తెలిసిందే.

ఈ సందర్భంగా తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు చిత్ర బృందం.ఈ నేపథ్యంలోనే అనసూయ తన స్పీచ్ తో అదరగొట్టేసింది.

ఈ సందర్భంగా అనసూయ మాట్లాడుతూ.ముందుగా ఇండస్ట్రీ పెద్దలందరికీ నా ధన్యవాదాలు.

అదేవిధంగా సభాముఖంగా దర్జా మూవీ టీం కి నాకు క్షమాపణలు తెలియజేస్తున్నాను.ఎందుకంటే నేను ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనలేకపోయాను అని చెప్పుకొచ్చింది అనసూయ.

కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ సినిమా టీమ్ ని నేను చాలా ఇబ్బంది పెట్టాను.ఈ సినిమాను నేను ఒప్పుకోవడానికి కారణం ఇద్దరూ అందులో ఒకరు ప్రభు గారు మరొకరు షకీల్ గారు అని తెలిపింది అనసూయ.

ఇందులో షకీల్ గారిని నేను సంగీత దర్శకుడు కాదు నిర్మాత అనుకున్నాను.

Telugu Anasuya, Darja, Darja Pre, Salim Malik, Sunil, Tollywood-Movie

ఎందుకంటే ప్రతిదీ ఆయనే దగ్గరుండి చూసుకున్నారు అని చెప్పుకొచ్చింది అనసూయ.నేను ఈ సినిమాలో కనకం పాత్రలో నటించాను.అలాగే నాతో పాటు ఈ సినిమాలో సునీల్, శిరీష నుల్లు, అక్సా ఖాన్, షమ్ము, సమీర్ తదితరులు నటించారు అని తెలిపింది అనసూయ.

ఆ తర్వాత అనసూయ మాట్లాడుతూ.మా దర్జా టీమ్ ని ఎంకరేజ్ చేయండి థియేటర్ కి వచ్చి సినిమాను చూడండి.ఎలా ఆయన సినిమా నెల రోజుల్లో ఓటీటీ లో వస్తుంది కదా అనుకోవద్దు మళ్లీ అనసూయ ని చూడాలి అనుకున్నప్పుడు ఓటీటీ లో చూడండి అంటూ సరదాగా మాట్లాడింది.ఆ తర్వాత చివరిలో దర్జా సినిమాలో డైలాగ్ చెప్పి అదరగొట్టేసింది.

నువ్వు బెదిరిస్తే భయపడడానికి.ఇంట్లో కూర్చునే ఆడదాన్ని అనుకున్నావ్ రా.చీల్చి చెండాడేస్తా నా కొడకా అనే మాస్ డైలాగ్ చెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube