అయ్యయ్యో కేటీఆర్ కు ఇప్పట్లో ఆ యోగం లేనట్టేనా ? 

ప్రస్తుతం తెలంగాణ అధికార పార్టీ టిఆర్ఎస్ లో కీలక నాయకుడు ఎవరంటే టక్కున చెప్పే పేరు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.గత కొంతకాలంగా కెసిఆర్ జాతీయ రాజకీయాలపై ఫోకస్ పెట్టడం తో , పూర్తిగా టిఆర్ఎస్ వ్యవహారాలన్ని కేటీఆర్ చూసుకుంటున్నారు.

 Trs Minister Ktr Political Career , Trs, Telangana, Telangana Government, Bjp, C-TeluguStop.com

అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలకు శ్రీకారం చుట్టడంతో పాటు,  పార్టీ పరంగా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటూ పార్టీలోనూ ప్రభుత్వంలోనూ తన సత్తా ఏమిటో చూపిస్తున్నారు.ఇక టీఆర్ఎస్ నాయకులు సైతం కేటీఆర్ ను ప్రసన్నం చేసుకున్నందుకు ఆయనతో భేటీ అయ్యేందుకు ఎక్కువగా ప్రాధాన్యం చూపిస్తున్నారు.2023లో జరగబోయే తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో టిఆర్ఎస్ మూడోసారి గెలిస్తే కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారనే నమ్మకం అందరిలోనూ ఉంది.వాస్తవంగా ఇప్పటికే మంత్రి కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు అప్పగించాల్సి ఉన్నా, అనేక రాజకీయ కారణాలతో దానిని వాయిదా వేస్తూ వచ్చారు.

         కానీ 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ విజయం సాధిస్తే తప్పకుండా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారని అంత అభిప్రాయపడుతున్న సమయంలోనే కేటీఆర్ బాంబు పేల్చారు.మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అంటూ కేటీఆర్ ప్రకటించారు.

  కేటీఆర్ వ్యాఖ్యాలతో, కేటీఆర్ సన్నిహితులు అభిమానులు డీలపడ్డారు.కేటిఆర్ ముఖ్యమంత్రి అవుతారని తామంతా భావిస్తూ ఉండగా,  మళ్లీ కేసీఆర్ కే అవకాశం అని ప్రకటించడం వెనుక రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అని ఆరా తీస్తున్నారు.

ఇక మళ్లీ కెసిఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నారంటూ కేటీఆర్ వ్యాఖ్యానించడంపై బీజేపీ నాయకురాలు విజయశాంతి స్పందించారు.     

Telugu Congress, Kcr Delhi, Telangana, Trs-Politics

   తనకు సీఎం అయ్యే అవకాశం ఇవ్వడం లేదని పరోక్షంగా కేటీఆర్ ఈ విధంగా తన బాధను వ్యక్తం చేస్తున్నట్లుగా ఆమె చెబుతున్నారు.గత కొంతకాలంగా కేసీఆర్ ఢిల్లీ రాజకీయ ఫోకస్ పెట్టడంతో పాటు ఎక్కువ సమయం ఫామ్ హౌస్ లోనే విశ్రాంతిలో గడుపుతున్నారు.దీంతో రానున్న రోజుల్లో పార్టీలోను, ప్రభుత్వం కేటీఆర్ కీలకంగా మారుతారని , ముఖ్యమంత్రిగా ఆయనను చూస్తామని ఆ పార్టీ నేతలంతా ఆశలు పెట్టుకోగా ఇప్పుడు స్వయంగా కేటీఆర్ ఈ విధమైన ప్రకటన చేయడంతో వారిలో నిరుత్సాహం అలుముకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube