కొందరు హీరోలు అభిమానుల్లో.ప్రేక్షకుల్లో ఒక రూపంతో ఫిక్స్ అవుతారు.
వారు అలా కాకుండా విభిన్నంగా కనిపిస్తే వెంటనే తీసుకోలేరు.నాగ చైతన్య ను ఎక్కువ గా కాస్త రఫ్ లుక్ లో చూడటం ను జనాలు అలవాటు చేసుకున్నారు.
హీరోగా నాగ చైతన్య ఎలా కనిపించినా.నటించినా కూడా నార్మల్ ప్రెస్ మీట్స్ మరియు ఇతర కార్యక్రమాల్లో మాత్రం రఫ్ లుక్ లోనే కనిపించడం జరిగింది.
కాని త్వరలో విడుదల కాబోతున్న థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మాత్రం చైతూను చూడలేక పోతున్నాం బాబోయ్ అంటూ ఆయన అభిమానులు ముఖ్యంగా అమ్మాయి లు కామెంట్స్ చేస్తున్నారు.నాగ చైతన్య ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న ద్వి భాష చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ గ్యాప్ లో ఇలా చైతూ థాంక్యూ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు.ఆ సినిమా లో కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెల్సిందే.
ఆ సినిమా లోని సన్నివేశాల కోసం నాగ చైతన్య ఇలా క్యూట్ లుక్ లోకి మారాడు.సినిమా లో ఏమో కాని ఇలా ప్రెస్ మీట్ లో.పబ్లిక్ ఈవెంట్స్ లో ఈయన్ను ఇలా చూడలేక పోతున్నాం అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.నాగ చైతన్య ఈ కొన్ని రోజులు అయినా నార్మల్ గా కనిపించవచ్చు కదా అంటున్నారు.
మొత్తానికి నాగ చైతన్య క్యూట్ అండ్ సాఫ్ట్ లుక్ ను జనాలు పెద్దగా ఇష్టపడటం లేదని దీంతో క్లారిటీ వచ్చింది.కనుక మాస్ లుక్ లోనే ఆయన జనాలకు నచ్చుతున్నాడు.
అందుకే ఆయన ఎంపిక చేసుకోబోతున్న పాత్ర ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవడం మంచిదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.







