అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుని ఇప్పుడు పుష్ప 2 పై అంచనాలు భారీ గా పెంచేసిన విషయం తెల్సిందే.పుష్ప 2 ను కేజీఎఫ్ 2 రేంజ్ లో అభిమానులు కూడా ఊహించేసుకుంటున్నారు.
అందుకే ఆరు నెలల పాటు దర్శకుడు సుకుమార్ స్క్రిప్ట్ పై వర్క్ చేశాడు.పుష్ప 2 సినిమా ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు మరియు పాన్ ఇండియా ప్రేక్షకులకు ఇటీవలే క్లారిటీ ఇవ్వడం జరిగింది.
పుష్ప 2 సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకుండానే అప్పుడే పుష్ప 3 గురించి చర్చ జరిగింది.హీరో గా బన్నీ పుష్ప 3 సినిమా ను చేసేందుకు ఓకే చెప్పాడు.
ఇటీవల పుష్ప 2 స్క్రిప్ట్ ను రెడీ చేస్తున్న సమయంలో నే పుష్ప 3 యొక్క స్టోరీ లైన్ వచ్చిందనే కామెంట్స్ వస్తున్నాయి.సోషల్ మీడియా లో పుష్ప 3 గురించి ఇప్పుడు ప్రముఖంగా చర్చ జరుగుతోంది.
మలయాళ స్టార్ నటుడు పుష్ప లో కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెల్సిందే.ఆయనే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట మీద మాట వచ్చి పుష్ప 3 ఉంటే తప్పేం లేదు.
ఉండే అవకాశం ఉందంటూ కామెంట్స్ చేశాడు.దాంతో ఇప్పుడు బన్నీ ఫ్యాన్స్ తో పాటు ప్రతి ఒక్కరు కూడా పుష్ప 3 గురించిన చర్చ లో మునిగి ఉన్నారు.
బన్నీ సన్నిహితులకు చాలా మంది ఫోన్ లు చేసి మరీ పుష్ప 3 గురించి అడిగి తెలుసుకుంటున్నారట.బన్నీ సన్నిహితులు మాత్రం పుష్ప 2 నే ఇంకా ప్రారంభం కాలేదు.
అప్పుడే పుష్ప 3 గురించి ఎలా మాట్లాడుతాం అన్నట్లుగా సమాధానం చెబుతున్నారట. పుష్ప 2 పూర్తి అయ్యి విడుదల అయితే తప్ప పుష్ప 3 విషయంలో ఒక స్పష్టత అనేది వచ్చే అవకాశం లేదు.
అప్పటి వరకు ఏం మాట్లాడుకున్నా కూడా పుకారే అవుతుంది.








