విష్ణు విశాల్ - చెల్లా అయ్యావు- ఆర్ టీ టీమ్‌వర్క్స్- విష్ణు విశాల్ స్టూడియోస్- 'మట్టి కుస్తీ' గ్లింప్స్ విడుదల

మాస్ మహారాజా రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌లపై  చెల్ల అయ్యావుతో దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం మట్టి కుస్తీ.ఈ రోజు విష్ణు విశాల్ పుట్టినరోజు కానుకగా స్పెషల్  గ్లింప్స్ వీడియోని విడుదల చేశారు.

 Vishnu Vishal, Chella Ayyavu, Rt Teamworks, Vishnu Vishal Studioz Matti Kusthi G-TeluguStop.com

టైటిల్ సూచిస్తునట్లుగా ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ రెజ్లర్ గా పరిచయం అయ్యారు.విష్ణు విశాల్ బైక్ నడుపుతూ విలన్స్ ని కొడుతూ పవర్ ఫుల్ గా కనిపించారు.

చివర్లో రెజ్లింగ్ రింగ్‌లో తన ప్రత్యర్థులను ఎదుర్కోవడానికి సన్నద్ధమవుతున్నట్లు కనిపించడం ఆసక్తికరంగా వుంది.ఈ గ్లింప్స్ విష్ణు విశాల్ పర్ఫెక్ట్ బర్త్ డే గిఫ్ట్ గా నిలిచింది.

మట్టి కుస్తీ స్పోర్ట్స్ ఫ్యామిలీ డ్రామా నేపధ్యంలో రూపుదిద్దుకుంటుంది.విష్ణు విశాల్ సరసన ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తోంది.ఈ చిత్రానికి జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందిస్తున్నారు.రిచర్డ్ ఎం నాథన్  సినిమాటోగ్రాఫర్ గా, ప్రసన్న ఎడిటర్ గా పనిచేస్తున్నారు.

తారాగణం:

విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి

సాంకేతిక విభాగం :

రచన, దర్శకత్వం:  చెల్లా అయ్యావు, నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్, బ్యానర్లు: ఆర్ టీ టీమ్‌వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ డీవోపీ: రిచర్డ్ ఎం నాథన్, సంగీతం: జస్టిన్ ప్రభాకరన్, ఎడిటర్: ప్రసన్న జికె, ఆర్ట్ డైరెక్టర్: ఉమేష్ జే కుమార్ లిరిక్స్: వివేక్, పీఆర్వో: వంశీ-శేఖర్

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube