నావల్ల ప్రాబ్లమ్ అయతే నేను వెళ్ళిపోతా ! అంటూ సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండడం చర్చనీయాంశం అవుతోంది.గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా , లేనట్టుగానే జగ్గారెడ్డి వ్యవహరిస్తున్నారు.
ముఖ్యంగా పార్టీ సీనియర్ నాయకులు మధ్య విభేదాలు తలెత్తడం,రేవంత్ రెడ్డి వర్గంతో జగ్గారెడ్డికి సఖ్యత లేకపోవడం ఇవన్నీ కారణాలుగా తెలుస్తోంది.అందుకే టీ.పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో ఉన్న జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ లో కేలకంగా భావిస్తున్న రచ్చబండ కార్యక్రమానికి టి.పిసిసి కార్యవర్గ సమావేశాలకు జగ్గారెడ్డి దూరంగానే ఉన్నారు.అంతేకాదు గాంధీభవన్ కు దూరంగా ఉంటుండడం చర్చనీయాంశం గా మారింది.
నిన్న ఓ ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశానికి జగ్గారెడ్డి హాజరు కాలేదు.ఆయనను ఈ సమావేశానికి రావాల్సిందిగా కొంతమంది ఎమ్మెల్యేలు పిలిచినా, తాను రానని వారికి చెప్పేసారట.
తాను తను నియోజకవర్గంలోనే సొంతంగా పార్టీ కార్యక్రమాలు చేసుకుంటానని వ్యాఖ్యానించారట.అంతేకాదు నిన్న అసెంబ్లీలో నిర్వహించిన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు వచ్చిన జగ్గారెడ్డి ఓటు వేసి వెంటనే వెళ్ళిపోయారు.
దసరా వరకు ఇదే వైఖరితో జగ్గారెడ్డి ఉండబోతున్నారట.దసరా తరువాత తన నిర్ణయం ఏంటో చెప్తాను అంటూ జగ్గారెడ్డి వ్యాఖ్యానించడంతో, ఆయన పార్టీకి దూరమవుతారని అంతా అంచనా వేస్తున్నారు.

ఇది ఎలా ఉంటే ఇకపై తాను పార్టీ విషయాలపై మాట్లాడకూడదని నిర్ణయించుకున్నానని , బిజెపి టిఆర్ఎస్ విషయంలో నూ మౌనంగానే ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఆయన చెబుతున్నారు.కొద్ది రోజులు క్రితం నిర్వహించిన తెలంగాణ కాంగ్రెస్ కార్యకర్త సమావేశాల్లో పార్టీ అంతర్గత విషయాలను మాట్లాడుతుండడంపై తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అందరికీ వార్నింగ్ ఇచ్చారు.ఇక అప్పటి నుంచి జగ్గారెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటూ వస్తున్నారు.ముఖ్యంగా రేవంత్ రెడ్డి తో జగ్గారెడ్డికి విభేదాలు ఉండడంతోనే ఈ విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం జరుగుతుంది.
తనను కోవర్ట్ అంటూ ప్రచారం చేస్తూ అవమానిస్తున్నారని , తన వల్లే ప్రాబ్లం అయితే తాను వెళ్ళిపోతాను అంటూ జగ్గారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తున్నారట.







