తెలుగు బుల్లితెర పై ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షో చూసేవారికి జబర్దస్త్ మేనేజర్ ఏడుకొండలు గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.అయితే జబర్దస్త్ షో విపరీతంగా పాపులాటి సంపాదించుకోవడంలో ఏడుకొండలు పాత్ర కూడా ఉంది అని చెప్పవచ్చు.
ఇది ఇలా ఉంటే ఇటీవలే మల్లెమాల నుంచి జబర్దస్త్ ఏడుకొండలు కూడా బయటకు వచ్చేసిన విషయం తెలిసిందే.కాగా కొద్దిరోజులుగా జబర్దస్త్ కమెడియన్ కిరాక్ ఆర్పి జబర్దస్త్ షోపై రెచ్చిపోయి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
కాగా ఇదే విషయంపై ఏడుకొండలు స్పందిస్తూ, కిరాక్ ఆర్పి మల్లెమాల సంస్థపై చేస్తున్న ఆరోపణలని తిప్పికొడుతూ అతని బండారం మొత్తం బయట పెట్టాడు.ఈ క్రమంలోనే జబర్దస్త్ కమెడియన్ సుడిగాలిసుధీర్ పై కూడా షాకింగ్ కామెంట్స్ చేశారు.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఏడుకొండలు ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ.తాను జబర్దస్త్ షో కి రావడానికి ప్రధాన కారణం పాలిటిక్స్ అని, కొత్తగా వచ్చిన వారు పాలిటిక్స్ ప్లే చేయడంతో అవి తనకు ఇష్టం లేక అక్కడి నుంచి వచ్చేసాను అని తెలిపారు ఏడుకొండలు.
అయితే శ్యాం ప్రసాద్ రెడ్డిని మాత్రం ఏ ఒక్కరూ ఒక్క మాట అన్నా కూడా నేను ఒప్పుకోను.ఇప్పుడు చెబుతున్నాను జబర్దస్త్ నుంచి ఎవరెవరైతే వెళ్ళిపోతున్నారో వాళ్ళందర్నీ మళ్లీ నేను వెనక్కి తీసుకొని వస్తాను చాలెంజ్ చేస్తున్నాను అంటూ చాలెంజ్ విసిరాడు ఏడుకొండలు.
జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన సీనియర్ కమెడియన్స్ వేణు చంద్రంతో పాటుగా వాళ్ళందరిని కూడా నేను తనతో పాటు జబర్దస్త్ కి తీసుకొని వస్తాను అని ఆయన తెలిపారు.అలాగే సుధీర్ గురించి మాట్లాడుతూ.
జబర్దస్త్ నాకు తల్లి లాంటిది అని సుధీర్ చాలా సందర్భాలలో తెలిపాడు అటువంటిది మరి తల్లిని వదిలి వచ్చేస్తారా అని ఆయన ప్రశ్నించారు? అయితే వీళ్ళందరూ కూడా బయట ఏషోలు చేయడానికి వీలు లేదు.ఎక్కడైనా చేస్తే వాళ్ల బండారులు మొత్తం బయట పెడతాను.ఇంకొక ఇంటర్వ్యూ చేసి నా దగ్గర ఉన్న ఆధారాలు అన్నీ కూడా బయట పెట్టేస్తాను అని తెలిపారు ఏడుకొండలు.అనంతరం కిరాక్ ఆర్పి గురించి మాట్లాడుతూ వాడు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గురించి అలా మాట్లాడుతున్నాడు.
ఆయనేం తక్కువ వ్యక్తి కాదు ఆయన అనడానికి వీడు సరిపోతాడా?వాడు చేసిన ఎన్నో స్కిట్లు బోలెడు కోర్టు కేసులు కూడా అయ్యాయి అని ఆయన తెలిపారు.ఇది ఈటీవీ కంటే మాటీవీలో డబ్బులు ఎక్కువ ఇస్తున్నారని అక్కడికి వెళ్తారా అని ఆయన ప్రశ్నించారు.
అలాగే కిరాక్ ఆర్పి జబర్దస్త్ నుంచి వెళ్లిపోయి నాలుగు,ఐదు ఏళ్ళు అవుతుంది అప్పటినుంచి ఏం మాట్లాడని వాడు ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇన్ని రోజులు ఎందుకు మాట్లాడలేదు అని అతను కిరాక్ ఆర్పి కి చురకలు అంటించాడు.
అదేవిధంగా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా సుధీర్ టీమ్ ఎన్ని కష్టాలు వచ్చినా విడిచి వెళ్ళము అని చెప్పారు మరి ఇప్పుడు ఎందుకు విడిపోయారు అని ఆయన ప్రశ్నించారు.అదేవిధంగా ప్రస్తుతం సుడిగాలి సుదీర్ తాను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదని ఒకప్పుడు తన ఫోన్ కోసం ఎంతగానో ఎదురు చూసే సుధీర్ ఇప్పుడు తాను ఫోన్ చేస్తుంటే, ఫోన్ ఎత్తకపోగా, షాపు ఓపెనింగ్ కీ కాల్ చేస్తే మా మేనేజర్ తో మాట్లాడుకోండి అని అంటున్నాడు అని చెప్పుకొచ్చారు ఏడుకొండలు. ప్రస్తుతం కొందరు సినిమాలలో నటిస్తూ బీజీ అంటున్నారు.
అదేవిధంగా సుధీర్ చేసిన ఏ సినిమా కూడా థియేటర్లలో సరిగ్గా హిట్టు కాలేదు.న్యాయంగా ఉండి సినిమాలు చేస్తేనే హిట్లవుతాయి చెప్పుకొచ్చారు ఏడుకొండలు.
అలాగే కిరాక్ ఆర్పి సినిమా చేస్తానని అంటున్నాడు ఎవరు వచ్చి సినిమా చేస్తారో నేను కూడా చూస్తాను అంటూ కిరాక్ ఆర్పి కి స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు ఏడుకొండలు.అంతేకాకుండా కిరాక్ ఆర్పి వచ్చి శ్యామ్ ప్రసాద్ రెడ్డికి క్షమాపణలు కూడా కోరాలి అని తెలిపారు.