సూర్య స్ట్రైట్ తెలుగు సినిమా ఫిక్స్.. డైరక్టర్ ఎవరంటే..!

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య డైరెక్ట్ తెలుగు సినిమాకి రంగం సిద్ధమైంది.దశాబ్ధ కాలంగా సూర్య స్ట్రైట్ తెలుగు సినిమాపై చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

 Surya Stright Telugu Movie Director Fix Details, Surya, Surya Telugu Movie, Dire-TeluguStop.com

అప్పట్లో త్రివిక్రం తో సూర్య సినిమా అంటూ మీడియా ఒకటే హడావిడి చేసింది.కానీ అది ఇప్పటివరకు కుదరలేదు.

ఆ కాంబో ఫిక్స్ అవుతుందనే నమ్మకం కూడా లేదు.ఇక మరోపక్క సూర్య బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా ఉంటుందని మొన్నామధ్య డిస్కషన్స్ వచ్చాయి.

బోయపాటి శ్రీను తో సూర్య సింగం లాంటి పవర్ ఫుల్ సినిమా చేయాలని ఫ్యాన్స్ కోరారు.అయితే బోయపాటి అప్పుడు ఓకే అని చెప్పినా సరే ఆ తర్వాత సూర్యతో సినిమాకు ఆసక్తి చూపించలేదు.

ఇక లేటెస్ట్ గా సూర్య తెలుగు, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న శివ డైరక్షన్ లో తెలుగు సినిమా ఫిక్స్ అయ్యాడట.తెలుగులో శౌర్యం సినిమా చేసిన శివ తమిళంలో అజిత్ తో వరుస సినిమాలు చేస్తూ వస్తున్నాడు.

శివ డైరక్షన్ లో తెలుగు, తమిళ భాషల్లో సూర్య సినిమా ఉంటుందని తెలుస్తుంది.ఈ సినిమాని ప్రముఖ నిర్మాతలు యూవి క్రియేషన్స్ నిర్మిస్తారని తెలుస్తుంది.యూవి క్రియేషన్స్ బ్యానర్ లో సూర్య, శివ కాంబో సినిమా సెట్స్ మీదకు వెళ్లబోతుంది.

Telugu Achaludu, Boyapati Srinu, Bala, Shiva, Suriya, Shauryam Shiva, Surya, Sur

సూర్య ప్రస్తుతం బాల డైరక్షన్ లో అచలుడు సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తి కాగానే శివ డైరక్షన్ లో సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది.సూర్య తెలుగు సినిమా కోసం తెలుగు ఆడియెన్స్ కూడా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.

శివ డైరక్షన్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ రాబోతుంది.యువి క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో ఈ మూవీ ప్లాన్ చేస్తున్నారట.

ఇక ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ గురించి మరిన్ని డీటైల్స్ బయటకు రావాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube