ఇండియాలో ప్రతి ఏడాది 20 కంటే ఎక్కువ భాషల్లో 1500 నుంచి 2000 సినిమాల వరకు విడుదలవుతున్నాయి.ఈ క్రమంలోనే చిన్న సినిమాల నుంచి భారీ సినిమాల వరకు తెరకెక్కుతున్నాయి.
అయితే మామూలుగా పరిమిత సంఖ్యలో భారీ బడ్జెట్ సినిమాలు వస్తుండగా గత కొన్నేళ్లుగా ట్రెండు మారింది.భారతదేశంలో వివిధ ప్రాంతాలలో సినిమాలు ప్రాంతీయ కంటెంట్ క్రాస్ ఓవర్ ప్రగతితో గొప్ప సినిమా టాక్ అనుభవాలను అందిస్తున్నాయి.
ఈ మధ్యకాలంలో అయితే ఎక్కువ మంది ప్రేక్షకులను చేరుకోవడానికి భారీ బడ్జెట్ సినిమాలను రూపొందిస్తున్నారు.అందుకు ఉదాహరణగా ఆర్ఆర్ఆర్, కేజిఎఫ్ 2 సినిమాలు భారీ బడ్జెట్ తో తెరకెక్కి బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను సాధించిన విషయం తెలిసిందే.
ఇది ఇలా ఉంటే 2022 – 23 సీజన్ లో 150 కోట్లకు మించిన బడ్జెట్ సినిమాలు ఏవేవో ఇప్పుడు తెలుసుకుందాం.
పొన్నియన్ సెల్వన్ 200 కోట్ల భారీ బడ్జెట్ రూపొందిస్తున్న ఈ సినిమా దర్శకుడు మణిరత్నం ప్రాజెక్ట్.
టాప్ ఫైవ్ భారతీయ సినిమాల్లో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ సినిమా కూడా ఒకటి.ఈ సినిమా పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కబోతోంది.
రెండవది షంషేరా.బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమా 150 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందింది.
ఈ సినిమా 1800 నాటి పీరియాడికల్ డ్రామా కథాంశంతో తెరకెక్కబోతోంది.మరొక సినిమా ఆది పురుష్.
దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం ఆది పురుష్.అయితే రామాయణం ఆధారంగా రూపొందుతున్న ఈ పీరియాడికల్ డ్రామా 400 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందుతున్న విషయం తెలిసిందే.

ఇందులో ప్రభాస్ సరసన కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తోంది.అలాగే ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.టైగర్ 3.225 కోట్ల భారీ బడ్జెట్ తో రూమ్ పొందుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్ ప్రదాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాకు మనిష్ శర్మ దశకత్వం వహిస్తున్నారు.బడే మియాన్ చోటే మియాన్ 2 300 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్న ఈ సినిమా లో అక్షయ్ కుమార్ టైగర్ శ్రాఫ్ దినపత్తులు నటిస్తున్నారు.
అలీ అబ్బాస్ జాఫర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.అలాగే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా పఠాన్.ఈ సినిమా 250 కోట్ల భారీ బడ్జెట్లో రూపొందుతోంది.ఇందులో షారుక్ ఖాన్ తో పాటుగా సల్మాన్ ఖాన్ కూడా కనిపించబోతున్నారు.
ఈ సినిమాకు సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు.భారతీయుడు 2 సినిమా 200 కోట్ల భారీ బడ్జెట్ తో తెలుగు,తమిళ, హిందీ భాషలో రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఇందులో కమలహాసన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.అలాగే రన్బీర్ కపూర్ అయాన్ ముఖర్జీ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం బ్రహ్మాస్త్ర.300 కోట్లకు పైగా బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.







