ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో విడాకుల సంస్కృతి పెరిగిపోతుండటం గమనార్హం.ముఖ్యంగా సెలబ్రిటీలలో విడాకులు తీసుకునే వాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
అయితే డైరెక్టర్ శ్రీనువైట్ల దంపతులు త్వరలో విడాకులు తీసుకోనున్నారని సమాచారం అందుతోంది.స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల భార్య విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి.
స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల కామెడీ సినిమాల ద్వారా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.ఒకవైపు సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు, మరోవైపు యంగ్ జనరేషన్ స్టార్ హీరోల సినిమాలకు పని చేయడంతో పాటు ఆ సినిమాలతో విజయాలను సాధించడం ద్వారా ఈ డైరెక్టర్ పాపులర్ అయ్యారు.
అయితే గత కొన్నేళ్లుగా శ్రీనువైట్ల డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
ప్రస్తుతం ఫ్లాపుల్లో ఉన్న ఈ డైరెక్టర్ కు సంబంధించి ఒక ప్రాజెక్ట్ ప్రకటన వెలువడినా ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందో లేదో క్లారిటీ లేదు.

ఆయన భార్య రూపావైట్లకు కూడా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు ఉంది.భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయని ఆ మనస్పర్ధలు పెద్దవి కావడంతో విడాకులు తీసుకునే పరిస్థితి ఏర్పడిందని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతుండటం గమనార్హం.

ఈ స్టార్ డైరెక్టర్ లేదా ఈ డైరెక్టర్ భార్య స్పందించి క్లారిటీ ఇస్తే మాత్రమే వైరల్ అవుతున్న వార్తల్లో నిజానిజాలు తెలిసే అవకాశం అయితే ఉంటుంది.మరో ఇద్దరు ప్రముఖ రచయితలతో కలిసి పని చేసిన సమయంలో సక్సెస్ లను సొంతం చేసుకున్న ఈ డైరెక్టర్ ప్రస్తుతం సరైన సక్సెస్ కోసం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు వైరల్ అవుతున్న వార్తలు స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల అభిమానులను మాత్రం తెగ టెన్షన్ పెడుతుండటం గమనార్హం.







