సైబర్ భద్రతపై అవగాహన కల్పించేందుకు యూపీ పోలీస్ వినూత్న వీడియో..!

ఉత్తర్ ప్రదేశ్ పోలీసుల సైబర్ విభాగం పోస్ట్ చేసిన ఒక వీడియో ఇప్పుడు విస్తృతంగా వైరల్ అవుతోంది.ఈ పోలీసులు స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్ పెట్టుకోవాలని యూజర్లకు తెలియజేసేందుకు ఒక వినూత్న మార్గం ఎంచుకున్నారు.

 Up Police Post On Using Strong Passwords With Football Video Details, Cyber Secu-TeluguStop.com

అదేంటంటే, ఫుట్‌బాల్ ఆడేటప్పుడు ఒక బలమైన గోల్ కీపర్ బాల్‌ని నెట్ లోపలికి ప్రవేశించకుండా ఎలా ఆపుతాడో, అలానే మీ స్ట్రాంగ్ పాస్డ్‌వర్డ్ కూడా హ్యాకర్ పంపే మాల్వేర్, హ్యాకింగ్ టూల్స్, వైరస్‌లను ఆపగలదని పోలీసులు తెలిపారు.ఈ విషయాన్ని అందరికీ అర్థమయ్యేలా ఒక ఫుట్‌బాల్ వీడియోని కూడా వాడేశారు.

వైరల్ అవుతున్న వీడియోలో గోల్‌మౌత్ వద్ద ఒక గోల్ కీపర్ గోల్ ఆపేందుకు కాచుకుని ఉండటం చూడవచ్చు.ఎలాగైనా గోల్ చేయాలని ప్రత్యర్థి జట్టు ఆటగాడు రెడీ కావడం కూడా గమనించవచ్చు.

ఈ వీడియోలో కనిపించే గోల్ కీపర్‌కి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్ అని యూపీ పోలీసులు పేరు పెట్టారు.గోల్ చేసే ఆటగాడికి హ్యాకర్ అని పేరు పెట్టారు.అయితే ఈ ఆటగాడు గోల్ చేసేందుకు బంతిని తన్నగానే గోల్ కీపర్ గాల్లో ఎగిరి మరీ బంతిని అడ్డుకున్నాడు.అలా అద్భుతమైన డిఫెన్స్ తో తన జట్టును ఓటమి నుంచి కాపాడుకున్నాడు.

అయితే ఒక స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్ బలమైన గోల్ కీపర్ లాగానే మీ ప్రైవసీ, డేటాను కాపాడుతుందని యూపీ పోలీసులు వీడియో రూపంలో తెలిపారు.

అందుకే ఈ బలమైన గోల్ కీపర్ లాగా మీ అన్ని సోషల్ మీడియా అకౌంట్స్‌కు, ఫోన్‌కి, ఇంకా తదితర వాటికి స్ట్రాంగ్‌ పాస్‌వర్డ్ సెట్ చేసుకోవాలన్నారు.ఈ వీడియో క్యాప్షన్‌లో “మీపై హ్యాకర్లను స్కోర్ చేయనివ్వకండి.మీ అకౌంట్స్‌కి ఈ గోల్ కీపర్‌లాంటి బలమైన పాస్‌వర్డ్‌తో సైబర్ నేరగాళ్ల దాడులను సమర్థవంతంగా ఎదుర్కోండి” అని పేర్కొన్నారు.“ఈ వీడియో ద్వారా ఒక బలమైన పాస్‌వర్డ్‌ డేటాను ఎలా కాపాడుతుందో తెలుసుకోగలిగాం” అని వీడియో చూసిన నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.దీనిపై మీరు కూడా ఓ లుక్కేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube