అసలు హోం వర్క్ ఎవరు కనిపెట్టారో తెలుసా మీకు..?!

హోం వర్క్.ఇది వింటేనే చిన్న పిల్లలకు ఎంతో బాధ వేస్తుంది.

 Do You Know Who Invented Homework, Home Work , Invention, Discover ,viral Lates-TeluguStop.com

బడిలో ఉండి ఇంటికొచ్చి కాస్తా రిలాక్స్ తీసుకుందామంటే హోం వర్క్ చేయడం పెద్ద తలనొప్పిగా ఉందంటూ పిల్లలు వాపోతుంటారు.దీని ధ్యాసలో పడి చిన్న పిల్లలు అవుట్ గేమ్స్ కు చాలా దూరంగా ఉన్నారని కొన్ని అధ్యాయనాలు చెబుతున్నాయి.

కొందరు ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అయితే చేసుకుంటారేమో కానీ విద్యార్థులు మాత్రం హోం వర్క్ అంటేనే భయపడతారు.అసలు ఈ హోం వర్క్ ను ఎవరో కనిపెట్టారో అని.కొన్నిసార్లు మనసులో తిట్టుకుంటూ ఉంటారు.పాటాలు వినడమే కాకుండా ఇంటికొచ్చి హోం వర్క్ చేయడం ఏమిటని అనుకుంటూ ఉంటారు.

కానీ ఈ హోం వర్క్ ఎవరూ కనిపెట్టారో ఇప్పటికి చాలామందికి తెలియదు.కొన్ని పరిశోధనల ప్రకారం హోం వర్క్ ఎవరూ కనిపెట్టారో ప్రస్తుతం మనం అంచనా వేయచ్చు.

ఇటలీలోని వెనిస్ కు చెందిన రాబర్టో నెవిల్లీస్ అనే టీచర్ వర్క్ ఫ్రం హోం విధానాన్ని ప్రారంభించారని చెబుతూంటారు.

ఆయన సరిగ్గా చదవని విద్యార్థులకు పనిష్మెంట్ ఇచ్చేవారట.

అయితే ఇది వెయ్యేళ్ల కిందట అంటే… 1095లో అంట.అందుకే దీనికి సంబంధించి వివరాలు తెలుసుకానీ.సాక్ష్యాలు లేవు.అందుకే రాబర్టో నెవిల్లీస్ ను బెనిఫిట్ ఆప్ డౌట్ కింద పక్కన పెట్టొచ్చు.అయితే హోం వర్క్ అనే దాన్ని నిజంగా ప్రారంభించినట్లుగా ఆధారాలున్న మహనీయుడు మాత్రం జాన్ అమెస్ కొమెనియస్.ఆయనను ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ గా పిలుస్తుంటారు.

ఆమెరికాలో ప్రారంభమైన ఈ హోమ్ వర్క్ ప్రపంచం మొత్తం విస్తరించింది.అయితే ఇది రాను రాను వెర్రి తలలు వేసింది.

దీన్ని బ్యాన్ చేయాలని డిమాండ్లు వినిపించాయి.హోం వర్క్ వల్ల పిల్లలు ఒత్తిడికి గురి చేయడం తప్పదని ఇప్పటికి కొందరు వాదిస్తూనే ఉంటారు.

ఇప్పుడు హోం వర్క్ ఎవరూ కనిపెట్టారో తెలిసినా ఏమి చేయలేని పరిస్థితి.ఏమైనా చేయాలంటే హోం వర్క్ చేయడం తప్పా ఏమీ చేయలేం అని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube