నందమూరి బాలకృష్ణ అఖండ సినిమాతో అఖండమైన విజయం అందుకున్నాడు.చాలా రోజుల తర్వాత హిట్ రావడంతో ఈ విజయం ఇచ్చిన ఉత్సాహంతో తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసి అదే ఉత్సాహంతో పూర్తి కూడా చేస్తున్నాడు.
ప్రెసెంట్ యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య తన 107 వ సినిమా చేస్తున్నాడు.గోపిచంద్ మలినేని క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తర్వాత బాలయ్యతో సినిమా చేస్తున్నాడు.
దీంతో ఈ సినిమాపై ముందు నుండి మంచి అంచనాలు ఉన్నాయి.ఇక ఇప్పుడు ఈ ఇద్దరు మాస్ వ్యక్తులు రంగంలోకి దిగడంతో సినిమా మనం ఊహించని రేంజ్ లో ఉంటుందని ఫ్యాన్స్ ఆతృతగా ఉన్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి బాలయ్య లుక్ రివీల్ అయ్యింది.ఈ లుక్ వచ్చిన తర్వాత మాస్ ప్రేక్షకులు మొత్తం ఈ సినిమాపై మరిన్ని హోప్స్ పెంచుకుని బాలయ్య విధ్వంసమైన నటన కోసం ఎదురు చూస్తున్నారు.
ఇది ఇలా ఉండగా ఈ సినిమా షూటింగ్ గత కొన్ని రోజులుగా ఆగిపోయిన విషయం తెలిసిందే. బాలయ్య కు కరోనా సోకడంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపి వేశారు.
అయితే ఈయనకు మళ్ళీ నెగిటివ్ రావడంతో షూటింగ్ స్టార్ట్ చేయాలని అనుకున్నారు.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఈ నెల 9 నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉండగా ఈ సినిమా టీమ్ లో మరికొంత మంది కీలక సభ్యులకు కరోనా పాజిటివ్ రావడంతో ఈ సినిమా షూటింగ్ వాయిదా వేశారు.

ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కు టైం ఫిక్స్ చేసినట్టు తెలుస్తుంది.జులై 24 నుండి కర్నూల్ లో నెక్స్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేయబోతున్నట్టు టాక్ బయటకు వచ్చింది.అలాగే ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సస్పెన్స్ కొనసాగుతుండగా.త్వరలోనే ఈ టైటిల్ పై అనౌన్స్ మెంట్ రాబోతుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంటే.కీలక పాత్రల్లో విజయ్ దునియా, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు.
మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నాడు.







