హులా హూప్ గేమ్ గురించి మీరు వినే ఉంటారు.ఈ గేమ్ లో ఒక రింగ్‌ను నడుము చుట్టూ గిరగిరా తిప్పుతూ ఉంటారు.
ఇది చిన్న పిల్లలు ఎక్కువగా ఆడుతుంటారు.ఫిట్నెస్‌పై మక్కువ ఉన్న వారు కూడా దీనిని ప్రతి రోజూ ప్రాక్టీస్ చేస్తారు.
దీనిని ఎక్కువసేపు ఆడాలంటే చాలా సాధన కావాలి.అలాగే శక్తి కూడా ఉండాలి.
అయితే మనుషులకే కష్టంగా అనిపించే ఈ వర్కౌట్‌ను తాజాగా ఒక కోతి సునాయాసంగా చేస్తూ ఆశ్చర్యపరుస్తోంది.దీన్ని చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.
సాధారణంగా ట్రైనింగ్ ఇస్తే కోతులు ఏదైనా చేయగలవు.ఈ కోతి కూడా ట్రైనింగ్ తీసుకుని సర్కస్ లో చేసే రింగ్ డ్యాన్స్ చేస్తూ అందరి చేత వావ్ అనిపిస్తోంది.
ఈ డ్యాన్స్‌ను సర్కస్‌లో అమ్మాయిలు చేస్తుంటారు.వారిని చూసి ప్రేక్షకులు మైమర్చిపోతుంటారు.
వారందరికంటే ఈ ఈ కోతి అద్భుతంగా డ్యాన్స్ చేసింది.నమ్మాలి అనిపించడంలేదు కదా, అయితే ఈ వీడియో చూస్తే.
మీరే ఒప్పుకుంటారు.

వైరల్ వీడియోలో ఒక కోతి ఒక చెక్కపై నిల్చొని అలవోకగా హూప్ రింగ్‌ను తన నడుము చుట్టూ తిప్పడం చూడవచ్చు.అది ఏదో ఫుడ్ తింటూనే ఈ రింగ్ కింద పడిపోకుండా నడుము ఊపింది.అంటే ఈ స్కిల్‌ను అది ఎంతలా మాస్టర్ చేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ వీడియోని క్రియేచర్ ఆఫ్ గాడ్ అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ‘బెస్ట్ హులా హూప్’ అని క్యాప్షన్ జోడించింది.కాగా దీనికి ఇప్పటివరకు 23 వేలకు పైగా వ్యూస్, 650కి పైగా లైక్స్ వచ్చాయి.11 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోని చూసి నెటిజన్లు మంత్రముగ్ధులవుతున్నారు.అద్భుతంగా చేసిందని కితాబిస్తున్నారు.ఈ వండర్‌ఫుల్ వీడియోని మీరు కూడా తిలకించండి.







