హైదరాబాద్ మాదాపూర్ లోని శిల్పారామంలో బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ను ప్రారంభించారు.ఈ మేళా ఈనెల 15న దీనిని ప్రారంభించారు.
ఈ భీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ను 25 వ తేదీ వరకూ నిర్వహించనున్నారు.కళాకారులు, చేనేత కార్మికులు తయారుచేసిన హస్తకళలు, చేనేత, ఖాదీ ఉత్పత్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి.
హైదరాబాద్ శిల్పారామం లోని బీహార్ క్రాఫ్ట్ మేళా హైదరాబాద్ నగర ప్రజలను ఆకట్టుకుంటోంది.ఉపేంద్ర మహారథి శిల్ప అనుసంధాన్ సంస్థాన్ డైరెక్టర్ అలోక్ కుమార్ ఈ మేళాను ప్రారంభించారు.
బీహార్ కు చెందిన కళాకారులు తయారు చేసిన పలు రకాల హ్యాండ్ పెయింట్స్, హ్యాండ్లూమ్స్ ఆకట్టుకుంటున్నాయి.ఈ బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ను ఈనెల 25 తారీఖు వరకు ఈ క్రాఫ్ట్ మేళా జరుగుతుందని అధికారులు వెల్లడించారు.ఈ మేళాలో మొత్తం 80 స్టాల్స్ నిర్వహించారు.అందులో వివిధ రకాల హస్తకళలు, చేనేత వస్త్రాలు, ఖాదీ దుస్తులను నిర్వాహకులు అమ్మకానికి పెట్టారు.
ఈ బీహారీ క్రాఫ్ట్ ఫెయిర్ ఉదయం పదిన్నర నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకూకొనసాగుతోందిసిక్కి ఆర్ట్, మంజుషా ఆర్ట్, సుజ్ని ఆర్ట్, మధుబని పెయింటింగ్ టికులీ ఆర్ట్ వంటి పెయింటింగ్స్ ను అప్పటికప్పుడు పెయింట్ చేసి అమ్ముతుండటం మరో విశేషం.అలాగే ఈబీహార్ క్రాఫ్ట్ ఫెయిర్‌లో భారతీయ శాస్త్రీయ నృత్యాల గొప్పతనాన్ని తెలియ జేస్తున్నారు నిర్వాహకులు.
బీహార్ జానపద సంగీతంతో పాటు జానపద నృత్యాలు చూపరులను మరింత ఆకట్టుకుంటున్నాయి.ఇక సందర్శకులు సైతం బీహారీ క్రాఫ్ట్ మేళాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
బీహారీ చేతి వృత్తి కళలు, వస్త్రాలు, పెయింట్స్ వంటివి తమను మరింత ఎట్రాక్ట్ చేస్తున్నాయని అంటున్నారు.అనునిత్యం సందడిగా ఉండే హైదరాబాద్ లోని మాదాపూర్ శిల్పారామం బీహారీ క్రాఫ్ట్ మేళాతో మరింత ప్రజలను ఆకర్షిస్తోంది.
కళాకారులు, చేనేత కార్మికులు తయారుచేసిన హస్తకళలు, చేనేత, ఖాదీ ఉత్పత్తులు అందర్నీ ఆకట్టుకున్నాయి.ఈ బీహార్ క్రాఫ్ట్ ఫెయిర్ ను ఈనెల 25 తారీఖు వరకు ఈ క్రాఫ్ట్ మేళా జరుగుతుందని అధికారులు వెల్లడించారు.
అయితే ఈ బీహారీ క్రాఫ్ట్ ఫెయిర్ ఉదయం 10:30 నుంచి రాత్రి 8 గంటల వరకు జరగనుంది.