క్రియేటివ్ డైరక్టర్ కృష్ణవంశీ డైరక్షన్ లో మరాఠి సూపర్ హిట్ మూవీ నట సామ్రాట్ రీమేక్ గా వస్తున్న సినిమా రంగమార్తాండ.ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం వంటి స్టార్స్ నటిస్తున్నారు.
ఈ సినిమాలో అలి రెజా, రాహుల్ సిప్లిగంజ్ లతో పాటుగా అనసూయ, శివాత్మికలు కూడా నటిస్తున్నారు.షూటింగ్ చివరి దశకు చేరుకున్న రంగమార్తాండ సినిమాకు కాస్టింగ్ చేత డబ్బింగ్ చెప్పిస్తున్నారు.
ఈమధ్యనే అనసూయ రంగమార్తాండ సినిమాకు డబ్బింగ్ పూర్తి చేయగా లేటెస్ట్ గా డాక్టర్ రాజశేఖర్ కూతురు శివాత్మిక కూడా డబ్బింగ్ పూర్తి చేసింది.
శివాత్మిక డబ్బింగ్ చెబుతున్న పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
దొరసాని సినిమాతో తెరంగేట్రం చేసిన శివాత్మిక తన మార్క్ చూపించాలని చూపిస్తుంది.సినిమాలతో సంబంధం లేకుండా హాట్ ఫోటో షూట్స్ తో అదరగొడుతున్న ఈ అమ్మడు సోలో హీరోయిన్ గానే కాదు సపోర్టింగ్ రోల్స్ కు సై అనేస్తుంది.
రంగమార్తాండ సినిమాలో శివాత్మిక పాత్ర నిడివి చాలా తక్కువే అయినా సినిమాలో ఆమె పాత్ర చాలా ఇంపార్టెంట్ అని తెలుస్తుంది.
ఇక ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ మరోసారి తన నటనతో మెప్పిస్తారని అంటున్నారు.

ప్రకాశ్ రాజ్ మాత్రమే కాదు ఎప్పుడూ తన కామెడీతో ఆడియెన్స్ ని కడుపుబ్బా నవ్వించే బ్రహ్మానందం కూడా రంగమార్తాండ సినిమాలో సీరియస్ పాత్ర చేస్తున్నట్టు తెలుస్తుంది.ఈ మూవీలో బ్రహ్మానందం రోల్ ఆడియెన్స్ ని మెస్మరైజ్ చేస్తుందని అంటున్నారు.రమ్యకృష్ణ కూడా తన పాత్రలో అదరగొడుతుందని అంటున్నారు.డైరక్టర్ గా కెరియర్ లో చాలా వెనకపడిన కృష్ణవంశీ రంగమార్తాండతో మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తున్నాడు.
మరి కృష్ణవంశీ అనుకునే రేంజ్ లో ఈ మూవీ హిట్ అవుతుందా లేదా అన్నది చూడాలి.







