సోషల్ మీడియా ప్రపంచంలో పెరిగిపోతున్నవేళ నిత్యం అనేక వీడియోలు సోషల్ మీడియా వేదికగా చక్కెర్లు కొడుతున్నాయి.వాటిలో కొన్ని నవ్వుని తెప్పిస్తే, మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
ఇంకొన్ని బాధను కలిగిస్తే, మరికొన్ని కోపాన్ని తెప్పిస్తాయి.అయితే వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా జంతువులకు సంబంధించినవే ఉంటున్నాయని ఓ సర్వే.
వాటి తరువాతి స్థానం పక్షులదే.తాజాగా.
కోళ్లకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.ఇక దీన్ని చూసి మ్యూజిక్ లవర్స్.
బీటు బాగుందంటూ స్టెప్పులేస్తున్నారు.
వీడియోలో ఏముందో ఒకసారి చూస్తే… అతగాడికి ఓ అద్భుతమైన ఐడియా వచ్చింది.
తాను పెంచుతున్న కోట్లతో సంగీతం వినాలి అనుకున్నాడు.అనుకున్నదే తడవుగా అమలు చేసాడు.
కోళ్లు డ్రమ్స్ వాయిస్తే ఎలా ఉంటుందో అని అలోచించి, వాటికి ఎదురుగా ఓ రెండు డ్రమ్స్ ఉంచాడు.ఆ తరువాత వాటిపైన కోళ్లకు మేతగా కొన్ని ధాన్యపు గింజలను వేసాడు.
వాటిని చూసిన కోళ్లు ఆనందంతో తినసాగాయి.దాంతో ఓ అందమైన డ్రమ్స్ సౌండ్ బయటకి వెలువడింది.
అది అతగాడికి నచ్చడంతో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసాడు.దాంతో ఆ వీడియో కాస్త వైరల్ అవుతోంది.
అవి ఆహారాన్ని తింటుండగా.అచ్చం డ్రమ్ములతో బీటు కొట్టినట్లు శబ్ధం వినిపిస్తుంది.సదరు వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.‘ఈ శబ్ధం మనోహరంగా వుంది’ అని కొందరు, ‘నాటు నాటు పాట కంటే బాగుంది‘ అని మరికొంతమంది, ‘ఇది కోళ్ల మ్యూజిక్!’ అని ఇంకొందరు… ఇలా రకరకాలుగా నెటిజన్లు తమ అభిప్రాయాలను వెళ్లబుచ్చుతున్నారు.వాస్తవానికి ఈ వీడియోను మొదట టిక్‌టాక్‌లో, తరువాత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.యానిమల్స్ డూయింగ్ థింగ్స్ animalsdoingthings అనే ఇన్‌స్టా పేజీ ఈ వైరల్ వీడియోను షేర్ చేయగా.
వేలాది మంది వీక్షించి పలు రకాల కామెంట్లు చేస్తున్నారు.







