అవును, అక్కడ అద్భుత ప్రపంచాన్ని మన కళ్లముందుంచుతున్నారు.దాన్ని చూడాలంటే సౌదీ అరేబియా వెళ్లాల్సిందే మరి.
సౌదీ అనేక విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి విదితమే.తాజాగా $500 బిలియన్ల NEOM స్మార్ట్ సిటీ అనే ఓ ప్రాజెక్ట్‌ను స్టార్ట్ చేసింది.
ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా బెల్జియం పరిమాణంలో ఉన్న ఎడారిని NEOM అని పిలిచే హైటెక్ సిటీ-ప్రాంతంగా మార్చనున్నారు.సౌదీ అరేబియాలో పర్యాటక రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్‌లో, సౌదీ క్రౌన్ ప్రిన్స్ మహ్మద్ బిన్ సల్మాన్ అనేక మార్పులు చేపట్టనున్నట్లు తెలిపారు.
సౌదీ అరేబియా తన ఆర్థిక వ్యవస్థను బలపరచుకొనే దిశగా అడుగులు వేస్తోంది.ఇప్పటివరకు ఈ ఫ్యూచరిస్టిక్ మెగాసిటీ న్యూయార్క్ నగరం కంటే 33 రెట్లు అద్భుతంగా ఉంటుందని చెబుతున్నారు.
ఇది అకాబా గల్ఫ్, సౌదీ అరేబియా యొక్క ఎర్ర సముద్ర తీరప్రాంతం వెంబడి 26,500 కి.మీ చదరపు విస్తీర్ణంలో ఉంటుంది.కృత్రిమ మేధస్సు , స్వచ్ఛమైన శక్తి వనరులను ఉపయోగించి ఈ మెగాసిటీ నిర్మితం అవుతుంది.2026 నాటికి ఇది పూర్తిగా సిద్ధం చేయనున్నారు.ఈ ప్రాజెక్టులో విశేషంగా మాట్లాడుకోవాలనంటే ఎగిరే డ్రోన్ టాక్సీలు, జురాసిక్ పార్క్-శైలి వినోద ఉద్యానవనం, ఒక పెద్ద కృత్రిమ చంద్రుడు ఈ నగరానికి ప్రతిష్టాత్మకమైన విషయాలని చెప్పుకోవాలి.

NEOM ప్రాజెక్ట్‌లో భాగం ‘ది లైన్‘ అని పిలువబడే మరొక క్లీన్ ఎనర్జీ డెస్టినేషన్, ఇది సరళ రేఖలో విస్తరించి ఉంది.ఈ రేఖ 105 మైళ్లు అంటే 170 కి.మీ మేర పొడవుతో విస్తరించి ఉన్న హైపర్‌కనెక్టడ్ కమ్యూనిటీల బెల్ట్‌గా ఉంటుందని అంచనా.దీని నిర్మాణానికే దాదాపు $200 బిలియన్లు ఖర్చవుతుందని భోగట్టా.ఇటీవలే, క్రౌన్ ప్రిన్స్ NEOMలో ట్రోజెనా, ఏడాది పొడవునా స్కీ గ్రామం, దాదాపు 2 మైళ్ల ఆర్టిఫిషియల్ మంచినీటి సరస్సుని నిర్మించడం జరిగింది.
సాంకేతికత, వినోదం, ఆతిథ్య సౌకర్యాల కలయికతో ఒక నిలువు గ్రామం కూడా ఇక్కడ కొలువుదీరివుంటుందని అంటున్నారు.వీలైతే ఇది పూర్తైన తరువాత ఓసారి వెళ్లి చూడండి.







