కేసీఆర్ అడ్దాలో ఇప్పుడు అలజడులు మొదలయ్యాయి.ఇంతకాలం గట్టిపునాదులు ఉన్నాయనుకుంటున్న నియెజకవర్గంలో ఇప్పుడు గెలుపు అనుమానంగా కనిపిస్తోంది.
కేసీఆర్ ను ఢీ కొట్టడానికి ఓ ధీటైన నేత రంగంలోకి దిగారు.ఇంతకాలం కేసీఆర్ ఇలాఖాగా కొనసాగిన గజ్వల్ లో.ప్రకంపనలు మొదలయ్యాయి.ఉద్యమ నేతలను.
రాజకీయ ఉద్దండులను.అడ్డు అనిపిస్తే.
ఎంతటి నేతనైనా.ఇట్టే పక్కన పెట్టే కేసీఆర్ కు ప్రస్తుతం గడ్డుకాలం నడుస్తోంది.
ఏవేవో సర్వేటీముల్ని తెచ్చుకున్నా.ఆ పాచికలు పారడం లేదు.
సర్వేల్లో కారుకు బ్రేకులు తప్పవన్న నిజం.టీఆర్ఎస్ కి కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.
కేసీఆర్ కు తిరుగులేదు అనుకునే టైంలో నిప్పులాంటి ఈటలను పార్టీ నుంచి పంపి.కొరివితో తల గోక్కున్నాడు.లేనిపోని అపనిందలతో.మేనేజ్ చేసిన కేసీఆర్ కు ఆయన ఏకులో మేకై కూర్చన్నారు.
హుజూరాబాద్ లో ఈటలను ఓడించడానికి దుష్టచతుష్ట పన్నాగాలు పన్నినా.ఆ ప్రజానాయకుడి విజయాన్ని ఆపలేక పోయారు.
తెలంగాణ కోసం అనేక త్యాగాలు చేసి.ప్రజా సేవకు అంకితమైన సమయంలో.
పార్టీ నుంచి బహిష్కరించినా.వెన్ను చూపకుండా.
మరోసారి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి కారు పార్టీకు కారు చీకట్లను చూపించారు.
ఇక కేసీఆర్ ను సాగనంపితే గానీ.
బంగారు తెలంగాణ సాధ్యం కాదని తెలుసుకున్న ఈటల.ఏకంగా కేసీఆర్ ఇలాఖ నే టార్గెట్ చేసుకున్నారు.గజ్వేల్ నుంచి పోటీ చేసి.కేసీఆర్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పరిమితం చేయాలని సంకల్పించారు.ఈటల గజ్వేల్ లో పోటీచేస్తే.కేసీఆర్ కు కష్టమే అని పలు సర్వేలు చెప్పడంతో.
కేసీఆర్ కు బుగులు పట్టుకుంది.
గజ్వేల్ లో గెలుపు నల్లేరు మీద నడకే అనుకున్న ఆ పార్టీకి ఈటల పక్కలో బల్లెంలా మారారు.పార్టీలో చేరికల సమన్వయ కమిటీ చైర్మన్ పదవి ఈటలకు దక్కడంతో.టీఆర్ఎస్ నుంచి వెళ్లిపోయిన వారిన.
ఉద్యమంలో రాష్ట్రం కోసం కొట్లాడిన వారందరిని ఆయన ఏకతాటిపైకి తీసుకు వస్తే.అది టీఆర్ఎస్ కు కొత్త కష్టాలు తెస్తాయన్నది వాస్తవం.
బెంగాల్ తరహా రాజకీయం తెలంగాణలో మోదలు కావడానికి ఎంతో కాలం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.గజ్వేల్ మరో నందీగ్రామ్ లా సంగ్రామ వేదిక కానుందని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే గజ్వేల్ కోటను పటిష్టం చేసుకోవడానికి కేసీఆర్ చేయని ప్రయత్నాలు లేవు.నియోజక వర్గంలో 4199 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను సాంక్షన్ చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రి కోసం 27 కోట్లు, మాతాశిశు సంరక్షణ ఆస్పత్రికి మరో 27 కోట్లతో ప్రత్యేక నిధిని పెట్టారు.నియోజక వర్గంలో రోడ్లు, భవనాల కోసం ఏకంగా 300 కోట్లు ఖర్చుచేశారు.
ఇవిగాక 2750 కోట్లు డెవలెప్ మెంట్ కోసం వెచ్చించారు.
రాజకీయంగా తనకు ఎదరు లేకుండా చేసుకునేందుకు ఏ నేతకు పెద్ద పదవులు కట్టబెట్టకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఎన్ని జిమిక్కులు చేసినా.ఈటల చేస్తున్న గ్రౌండ్ వర్క్ ముందు అవేవీ వర్క్ అవుట్ అయ్యేలా కనిపించడం లేదు.
నియోజక వర్గంలో వ్యతిరేకత పెరుగుతుండటంతో.ఆయన మరో నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది.
రాజకీయాల్లో బళ్లు ఓడలు అవ్వడం.ఓడలు బళ్లు అవడం సహజం.మరి ఈ సారి జరగబోయే ఎన్నికల్లో రాజకీయ రణరంగంగా మారబోతోంది అనేది మాత్రం వాస్తవం.మరి ఈసారి నందీగ్రామ్ సీన్ రిపీట్ అయితే.
కేసీఆర్ కు ఇక రాజకీయ సన్యాసం తప్పదు.మరి ఈటల ధీమా కనుక నిజమైతే.
బీజేపీ గెలుపు మాత్రం నల్లేరు మీద నడకే అవుతుంది.