తెలంగాణలో రాజకీయ సమీకరణాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి.ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో టీఆర్ఎస్ నేతల గుండెల్లో గుబులు మొదలైంది.
పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటూ సేవ చేసిన వారిని పక్కకు పెట్టి.కొత్త వారికి టికెట్ ఇవ్వడంతో గతంలో నేతలంతా నైరాష్యంలో పడిపోయారు.
ఈ క్రమంలో ఈసారైనా టికెట్ దక్కించుకుని నల్లగొండలో తన సత్తా చాటలనుకుంటున్నారటా ఓ నేత.మూడు మండలాల్లో తన అనుచరణ వర్గంతో చర్చలు జరుపుతూ.టికెట్ వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారట.అంతేకాదు గెలుపు కోసం ప్రణాళికలు సైతం సిద్ధం చేస్తున్నారట.
పోరాటల పురిటిగడ్డగా.ఎందరో ఉద్యమ నేతలకు పురుడు పోసిన ప్రాంతంగా నల్గగొండ జిల్లా ప్రసిద్ధి చెందింది.
రాష్ట్ర రాజకీయాలన్నీ నల్లగొండ చుట్టే తిరుగుతుంటాయి.తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భావం నుంచి ముందుండి పార్టీని బలోపేతం చేయడానికి ఎంతో కష్టపడిన నేతలకు ఆశించిన ఫలితం దక్కకపోవడంతో వారంతా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు.
ఇందులో ప్రధానమైన వ్యక్తి టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేస్తున్న చాడా కిషన్ రెడ్డి.తెలంగాణ మలిదశ ఉద్యమంలో చాడ కీలక పాత్ర పోషించారు.ఉద్యమ సమయంలో ఆయనపై ఎన్నో కేసులు కూడా నమోదయ్యాయి.
2018 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గం నుంచి చాడా టీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించారు, కానీ అప్పటి రాజకీయ సమీకరణాలను బట్టి అధినాయకత్వం కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని ఓడించడానికి.ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఓడిపోయిన కంచర్ల భూపాల్ రెడ్డిని టీఆర్ఎస్ లోకి ఆహ్వనించి నియోజకవర్గ ఇంచార్జ్ పదవిని కట్టబెట్టారు.భూపాల్ రెడ్డికి టికెట్ కేటాయించడం మొదటి నుండి పార్టీలో ఉన్న పాత నేతలకు మింగుడు పడలేదు.
ఈ క్రమంలో గులాబీ బాస్ అందిరిని పిలిచి నచ్చజెప్పడంతో అంతా భూపాల్ రెడ్డి గెలుపుకు సహకరించారు.
అయితే, రానున్న ఎన్నికల్లో నల్గొండ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ టికెట్ సాధించుకునే ప్రయత్నంలో ఎంతో మంది నేతలు బరిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో టికెట్ సాధించాలనే పట్టుదలతో ఉన్న చాడ కిషన్ రెడ్డి ఇప్పటికే తన ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం.టికెట్ కేటాయించడంపై అధికార పార్టీ అగ్రనేతల నుంచి ఓ క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది.
చాడా కిషన్ రెడ్డికి టీఆర్ఎస్ లో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి.పార్టీ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనడం,.
అధినాయకత్వం చెప్పిన మాటలను గౌరవిస్తూ అందరితో కలిసిమెలిసి ఉండడంతో చాడకు ఈసారి టికెట్ దక్కుతుందనే మాటలు ద్వితీయ స్థాయి నాయకుల నోట వినిస్తున్నాయి.
మరోవైపు,.
నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి, చాడా కిషన్ రెడ్డి మధ్య తీవ్ర వర్గ పోరు సాగుతుంది.దీంతో ఇరు వర్గాల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది.
ప్రస్తుతానికి పార్టీ కార్యక్రమాలలో ఇద్దరు నేతలు పాల్గొన్నా.ఎడమొహం పెడ మొహంగానే ఉండడటంతో పార్టీ నేతల్లో ఆందోళన నెలకొంది.

టీఆర్ఎస్ అధిష్టానం ఈసారి తనకు టికెట్ కేటాయిస్తే.నల్లగొండ నియోజకవర్గంలో గెలిచి చూపిస్తానని చాడ కిషన్ రెడ్డి అంటున్నారు.ఇప్పటికే గెలుపు దిశగా కార్యచరణ ప్రారంభించిన ఆయన.తెలంగాణ ఉద్యమ కారులను కలిసి తనదైన శైలిలో ముందుకెళ్తున్నారు.ఏది ఏమైనా ఈ సారైన చాడాకు న్యాయం జరిగేనా.? ఆశించిన విధంగా నియోజకవర్గం బరిలో నిలబడే అవకాశం చాడా కిషన్ రెడ్డికి గులాబీ బాస్ కల్పిస్తారా.? లేదా అనేది తెలియాలంటే మరికొంత సమయం వేచి చూడాల్సిందే…
.







