తెలుగులో తక్కువ సినిమాలే చేసినా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న హీరోయిన్లలో సుహాసిని ఒకరనే సంగతి తెలిసిందే.ప్రస్తుతం సుహాసిని తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగిస్తున్నారు.
సుహాసిని నటిగానే ప్రేక్షకులకు సుపరిచితమైనా ఆమెకు కథకురాలిగా, ప్రొడ్యూసర్ గా ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు ఉంది.నెంజతై కిల్లతే అనే తమిళ సినిమాతో నటిగా సుహాసిని సినీ కెరీర్ మొదలైంది.
సుహాసిని కమల్ హాసన్ అన్న కూతురు కావడం గమనార్హం.నాలుగు సినిమాలకు సుహాసిని కథకురాలిగా పని చేయగా ఇందిర సినిమాకు దర్శకురాలిగా పని చేశారు.తాజాగా ఒక నెటిజన్ సుహాసిని ఫోటోను షేర్ చేయగా పదహారేళ్ల పిల్లలా ఉన్నావని చెబుతూ కామెంట్ చేశారు.సాధారణంగా నెటిజన్ల నుంచి వచ్చే ఈ తరహా కామెంట్లను హీరోయిన్లు పెద్దగా పట్టించుకోరు.
అయితే నెటిజన్ చేసిన కామెంట్ గురించి సుహాసిని రియాక్ట్ అయ్యారు.
నెటిజెన్ కామెంట్ కు సుహాసిని నవ్వుతూ తన వయస్సు 61 అని 16 నంబర్ ను రివర్స్ చేస్తే తన వయస్సు వస్తుందని చెప్పుకొచ్చారు.

సుహాసిని నెటిజన్ కామెంట్ విషయంలో రియాక్ట్ అయిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.సుహాసిని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సుహాసిని ఈ మధ్య కాలంలో తెలుగులో పరిమితంగా సినిమాలలో నటిస్తున్నారు.

తనను మెప్పించే కథ వస్తే మాత్రమే సుహాసిని కొత్త పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని తెలుస్తోంది.పాత్ర కోసం తనకు తానుగా పూర్తిస్థాయిలో మార్చుకుంటున్న హీరోయిన్లలో సుహాసిని ఒకరు కావడం గమనార్హం.సుహాసిని భవిష్యత్తు ప్రాజెక్ట్ లతో సైతం విజయాలను సొంతం చేసుకోవాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు.
సుహాసినికి ప్రేక్షకుల్లో క్రేజ్ ఏ మాత్రం తగ్గకపోవడం గమనార్హం.సాఫ్ట్ రోల్స్ లో సుహాసిని ఎక్కువగా నటించగా ఆమెను నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రల్లో చూడాలని పలువురు అభిమానులు కోరుకుంటున్నారు.







