వర్షాకాలం కావడం వలన దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.అనేక సముద్ర తీరప్రాంత రాష్ట్రాల్లో ఎడతెరపి లేకుండా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి.
ఈ క్రమంలో అనేక విచిత్రకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి.కాగా కొన్ని రోజుల క్రితం బీహార్‌లోని అనేక ప్రాంతాల్లో కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అనేక విపత్తులు సంభవిస్తున్నాయి.
వరద ఉధృతికి అనేక ప్రాంతాలు నేలమట్టం అవుతున్నాయి.ఆ రాష్ట్రంలోని వైశాలి జిల్లాలోని ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ నియోజకవర్గం రాఘోపూర్‌లో కూడా వరద పోటెత్తింది.
రాఘవపూర్ సమీపంలోని గంగానది ఉప్పొంగడంతో ఆ సమయానికి అక్కడ వున్న మావటి, ఏనుగు అక్కడ చిక్కుకున్నారు.అయితే ఏనుగు బాగా ఎత్తుగా ఉండటం వలన మావటి దానిమీద కూర్చొని ప్రాణాలు దక్కించుకున్నాడు.
ఈ క్రమంలో ఏనుగు తన యజమానికి సాయాన్ని కొనియాడకుండా ఉండలేము.అయితే ఆ నదిలో ఏనుగు, మావటి వరద నీటిని దాటడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించిన వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇకపోతే అక్కడ ఆ ఏనుగు గంగానదిని దాటాలన్నా ప్రాణంతో కూడుకున్నది.అయితే ఆ మావటి ఎంతో చాకచక్యంతో వ్యవహరించాడు.
ఆ నీటిలో ఏనుగు దాదాపు పూర్తిగా మునిగిపోయినట్లు కనిపిస్తోంది చూడండి.ఆ ఏనుగును సురక్షితంగా ఒడ్డుకు చేర్చేందుకు మావటి బలమైన అలల మధ్య దాని చెవిని పట్టుకొని దానిపై కూర్చున్నాడు.
మావటితో కలసి ఆ ఏనుగు గంగానది గుండా ఏకంగా 3 కిలోమీటర్లు ఈదుకుంటూ ధైర్యంగా సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు.కాగా సదరు వీడియోని గంగానది ఒడ్డున వున్న ఎవరో యువకులు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వెలుగు చూసింది.