ఈ మధ్య కాలంలో నరేష్ పవిత్ర లోకేశ్ గురించి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఎన్నో వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి.అయితే వీళ్లిద్దరి మధ్య పరిచయం ఎక్కడ మొదలైంది ఎప్పుడు మొదలైంది అనే చర్చ కూడా అభిమానుల మధ్య జోరుగా జరుగుతుండటం గమనార్హం.
ఇందుకు సంబంధించి ఆసక్తికర విషయాలు ప్రస్తుతం వెలుగులోకి వస్తున్నాయి.నరేష్ రమ్య రఘుపతి ఇంకా విడాకులు తీసుకోలేదనే సంగతి తెలిసిందే.
ప్రస్తుతం నరేష్ రమ్య రఘుపతిల విడాకుల సమస్య కోర్టులోపెండింగ్ లో ఉంది.ఈ సమస్య ఎప్పటికి పరిష్కారం అవుతుందో తెలీదు.ఈ సమస్య పరిష్కారం కాని పక్షంలో నరేష్ పవిత్రల పెళ్లి అంతకంతకూ ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.సమ్మోహనం అనే సినిమా షూటింగ్ సమయంలో నరేష్ పవిత్రలకు పరిచయం ఏర్పడిందని సమాచారం అందుతోంది.
ఆ సినిమాలో హీరో తల్లీదండ్రుల పాత్రలలో నరేష్, పవిత్ర లోకేశ్ కనిపించారు.
ఆ తర్వాత నరేష్ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాలలో నరేష్, పవిత్ర లోకేశ్ పాల్గొన్నారని సమాచారం అందుతోంది.
నరేష్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు ఎన్నికైన సమయంలో కూడా పవిత్ర లోకేశ్ నరేష్ వెంట ఉండటం గమనార్హం.నరేష్, పవిత్ర లోకేశ్ కలిసి నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ ను సొంతం చేసుకున్నాయి.
పవిత్ర లోకేశ్ భర్తతో విడాకులు తీసుకోకపోయినా ప్రస్తుతం సింగిల్ గానే ఉంటున్నారు.

నరేష్ చాలా సందర్భాల్లో పవిత్ర లోకేశ్ ను ప్రశంసించగా అందుకు సంబంధించిన వీడియోలు సైతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.పవిత్ర లోకేశ్, నరేష్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.వీళ్లిద్దరూ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
నరేష్ పవిత్రలకు ప్రేక్షకులలో భారీస్థాయిలో క్రేజ్ ఉంది.







