పిశాచి2 నుండి హార్ట్ టచ్చింగ్ సింగిల్ కాలమెంత వేగములే విడుదల

విలక్షణ దర్శకుడు మిస్కిన్ దర్శకత్వం వహించిన పిశాచి తెలుగు, తమిళ భాషల్లో పెద్ద హిట్ గా నిలిచింది.ఇప్పుడు మిస్కిన్ ‘పిశాచి2’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.

 Most Rejoiceful Single Kaalamentha Vegamule From Pisachi 2 Out , Pisachi 2 , Sin-TeluguStop.com

ఇది సీక్వెల్ కాదు.అయితే అదే జోనర్‌లో వస్తుంది.

పిశాచి కొత్త నటీనటులతో వచ్చింది.అయితే రెండవ ఫ్రాంచైజీలో ఆండ్రియా జెరెమియా, విజయ్ సేతుపతి, సంతోష్ ప్రతాప్, పూర్ణ లాంటి స్టార్ కాస్ట్ పిశాచి2 లో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దిల్‌రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ సమర్పణలో రాక్‌ఫోర్ట్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ సంస్థ నిర్మిస్తోంది.

ఈ చిత్రం యొక్క ఫస్ట్ సింగల్-కాలమెంత వేగములే విడుదలైంది.

సంగీత దర్శకుడు కార్తీక్ రాజా, గాయకుడు సిద్ శ్రీరామ్‌ల మ్యాజికల్ కాంబినేషన్‌లో హార్ట్ టచ్చింగ్ గా అనిపిస్తుందీ పాట.కంపోజిషన్ ఆహ్లాదకరంగా మనసుని హత్తుకునేలా వుంది.సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మెస్మరైజ్ చేశారు.ఈ పాటకు పోతుల రవికిరణ్ సాహిత్యం అదించారు.ఈ చిత్రం టీజర్‌కు మంచి స్పందన లభించింది, మొదటి సింగిల్ కాలమెంత వేగములే ఇన్స్టంట్ హిట్ అయ్యింది.త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube