ఆ సినిమా రిజెక్ట్ చేసి పాన్ ఇండియా హీరోయిన్ ఛాన్స్ మిస్ చేసుకున్న లావణ్య?

సాధారణంగా కొన్ని సినిమా అవకాశాలు కొంతమంది సెలబ్రిటీలకు రావడంతో చాలామంది ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతారు.అయితే అప్పటికే పలు సినిమాలలో నటించడం వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా మరికొన్ని సినిమాలు వారికి సెట్ అవ్వవు అని భావించి రిజెక్ట్ చేస్తూ ఉంటారు.

 Lavanya Missed Bumper Offer Rejected Star Hero Movie , Lavanya ,andhala Rakshasi-TeluguStop.com

అయితే కొందరు కథ నచ్చకపోవడం వల్ల కూడా సినిమాలను రిజెక్ట్ చేస్తూ ఉంటారు.అయితే ఇలా రిజెక్ట్ చేసిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంటే పశ్చాత్తాప పడిన ఎంతో మంది సెలెబ్రెటీలు ఉన్నారు.

ఇలాంటి వారిలో నటి లావణ్య త్రిపాఠి ఒకరు.

అందాల రాక్షసి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ పలు సినిమాలలో నటించిన అగ్రతారాల లిస్టులోకి చేరుకోలేకపోయింది.

ఈమె నటించిన భలే భలే మగాడివోయ్ సినిమా తనకు మంచి క్రేజ్ తీసుకువచ్చింది.ఈ సినిమా తర్వాత సోగ్గాడే చిన్నినాయన సినిమా ద్వారా కూడా మంచి గుర్తింపు పొందిన అగ్రతారగా పేరు సంపాదించుకోలేకపోయింది.

ఇకపోతే తాజాగా హ్యాపీ బర్త్ డే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ ఈ సినిమా కూడా తనని నిరాశపరిచిందని చెప్పాలి.

Telugu Andala Rakshasi, Geetha Govindam, Lavanya-Movie

లావణ్య తన సినీ కెరియర్లో సూపర్ హిట్ చిత్రాన్ని మిస్ చేసుకుందని, ఆ సినిమాలో కనుక నటించి ఉంటే ప్రస్తుతం ఈమె పాన్ ఇండియా హీరోయిన్ అయ్యేదని చెప్పాలి.ఇకపోతే లావణ్య త్రిపాటి మిస్ చేసుకున్న ఆ సినిమా ఏంటి అనే విషయానికి వస్తే పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ రష్మిక నటించిన చిత్రం గీతా గోవిందం.ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుందో మనకు తెలిసిందే.

ఇకపోతే ఈ సినిమాలో నటించే అవకాశం ముందుగా లావణ్య త్రిపాఠి వచ్చింది.అయితే కొన్ని కారణాల లావణ్య ఈ సినిమాను రిజెక్ట్ చేయడంతో ఆ అవకాశం రష్మికకు రావడం ఆమె ఈ సినిమాలో నటించి మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా నేడు పాన్ ఇండియా హీరోయిన్ గా గుర్తింపు పొందింది

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube