లెజెండ్ శరవణన్ మల్టీ లాంగ్వెంజ్ భారీ పాన్-ఇండియా చిత్రం ‘ది లెజెండ్’తో కధానాయకుడిగా పరిచయం అవుతున్నారు.లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆయనే స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఎమోషన్, యాక్షన్, రొమాన్స్, కామెడీ కమర్షియల్ ఎలిమెంట్స్ కూడిన ఈ మాస్ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం జెడి-జెర్రీ.
‘ది లెజెండ్’ జులై 28న ప్రపంచ వ్యాప్తంగా తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.‘ది లెజెండ్’ థియేట్రికల్ హక్కులను వివిధ పరిశ్రమల్లోని ప్రముఖులు సొంతం చేసుకున్నారు.శ్రీ లక్ష్మీ మూవీస్ సంస్థ తిరుపతి ప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనున్నారు.
తమిళం, ఇతర భాషల్లానే ‘ది లెజెండ్’ తిరుపతి ప్రసాద్ శ్రీ లక్ష్మీ మూవీస్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో థియేటర్లలో విడుదల కానుంది.
ఒక సామాన్యుడు తన శ్రమ, సమర్ధత, బలంతో అన్ని అడ్డంకులను అధిగమించి ‘లెజెండ్’గా ఎలా నిలిచాడనేది ఈ సినిమాలో గ్రాండియర్ గా చూపించబోతున్నారు.
శరవణన్ మైక్రోబయాలజీ శాస్త్రవేత్తగా కనిపించనున్న ఈ చిత్రం మెడికల్ మాఫియా నేపధ్యంలో అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించేలా వుంటుంది.
చెన్నై, కుంభకోణం, పొల్లాచ్చి, హిమాలయాల్లో ‘ది లెజెండ్’ చిత్రీకరణ జరిపారు.
ఈ సినిమా షూటింగ్ కోసం చెన్నైలో భారీ సెట్ వేశారు.ముఖ్యమైన సన్నివేశాలు, పాటలను ఉక్రెయిన్‌లో చిత్రీకరించారు.
ఇండిపెండెంట్ సాంగ్స్ తో పాపులరైన ముంబై మోడల్ ఊర్వశి రౌతేలా ఈ చిత్రంలో కధానాయికగా కనిపించనుంది.లెజెండ్ శరవణన్‌తో కలిసి ‘ది లెజెండ్’లో అన్ని భాషలకు చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేశారు.
ప్రముఖ హాస్యనటుడు వివేక్‌కి ఇదే చివరి సినిమా.ప్రముఖ హాస్యనటుడు యోగిబాబు కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.సినిమాలోని ప్రముఖ పాత్రలన్నీ పేరున్న నటీనటులే పోషించారు.
హారిస్ జయరాజ్ ఈ చిత్రానికి యూత్ ఫుల్ ఆల్బమ్ అందించారు.
ఆర్‌వేల్‌రాజ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ రూబెన్, ఎస్‌ఎస్ మూర్తి ఆర్ట్‌వర్క్ అందించారు.పట్టుకోట్టై ప్రభాకర్ డైలాగ్స్ రాయగా, స్టంట్ కొరియోగ్రఫర్ గా అనల్ అరసు, కొరియోగ్రఫీగా రాజు సుందరం, బృందా, దినేష్ మాస్టర్స్ పని చేశారు.
తారాగణం:
లెజెండ్ శరవణన్, ఊర్వశి రౌటేలా, వివేక్, యోగి బాబు, విజయకుమార్, ప్రభు, నాజర్, సుమన్, తంబి రామయ్య, రోబో శంకర్, మయిల్‌సామి, హరీష్ పారెడ్డి, మునిస్కాంత్, మన్సూర్ అలీ ఖాన్, రాహుల్ తదితరులు.
సాంకేతిక విభాగం:
కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: జేడీ-జెర్రీ, నిర్మాత: శరవణన్, బ్యానర్: లెజెండ్ న్యూ శరవణ స్టోర్స్ ప్రొడక్షన్స్, విడుదల: తిరుపతి ప్రసాద్ (శ్రీ లక్ష్మీ మూవీస్), సంగీతం: హారిస్ జయరాజ్, డీవోపీ: ఆర్ వెల్రాజ్, ఎడిటింగ్: రూబెన్, ఆర్ట్: ఎస్.ఎస్.మూర్తి, డైలాగ్స్: పట్టుకోట్టై ప్రభాకర్, స్టంట్స్: అనల్ అరసు.