తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన మేడే రాజివ్ సాగర్.జూబ్లీహిల్స్ లోని కార్యాలయంలో మంత్రులు జగదీశ్వర్ రెడ్డి, సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కవిత దంపతుల సమక్షంలో రాజివ్ సాగర్ బాధ్యతలు చేపట్టారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో పాల్గొని ప్రస్తుతం తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.బాధ్యతలు చేపట్టే ముందు మంత్రులు జగదీశ్వర్ రెడ్డి సత్యవతి రాథోడ్ల సమక్షంలో రాజు సాగర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహిస్తానని రాజీవ్ సాగర్ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.







