శక్తిమాన్ ని అతని చేతుల్లో పెడుతున్నారా..?

నైంటీస్ డేస్ లో సూపర్ హీరో సీరియల్ శక్తిమాన్ గురించి అందరికి తెలిసిందే.చిన్న పిల్లల్ని ఎంతగానో ఆకట్టుకున్న శక్తిమాన్ సీరియల్ అప్పట్లో బిగ్గెస్ట్ హిట్.

 Finally Shakthi Man Director Fix Sony Pictures Details, Aadipurush, Shakthi Man,-TeluguStop.com

సూపర్ హీరో పాత్రని సిల్వర్ స్క్రీన్ మీద చూపించాలని చూస్తున్నారు సోనీ పిక్చర్స్.ఇప్పటికే శక్తిమాన్ సినిమాకు కథా చర్చలు ముగిశాయి.

అయితే ఈ సినిమాని హ్యాండిల్ చేసే డైరక్టర్ గురించి కొన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి.

శక్తిమాన్ సినిమాని బాలీవుడ్ లో ఏ డైరక్టర్ తో చేయించాలా అని సోనీ పిక్చర్స్ ఆలోచన చేసింది.

ఫైనల్ గా ఓ డైరక్టర్ కి వారు ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.అతనెవరో కాదు ఆదిపురుష్ సినిమా చేసిన ఓం రౌత్ ని ఫైనల్ గా ఫిక్స్ అయ్యారట సోనీ పిక్చర్స్.

ప్రభాస్ హీరోగా రామాయణ కథతో వస్తున్న సినిమా ఆదిపురుష్.ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నాడు.సినిమాలో సీత పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.రావణుడుగా సైఫ్ అలి ఖాన్ చేస్తున్నారు.

తానాజీ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఓం రౌత్ ఆదిపురుష్ తో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నారు.

Telugu Aadipurush, Bollywood, Om Raut, Krithi Sanon, Prabhas, Saif Ali Khan, Sha

ఆదిపురుష్ రిఫరెన్స్ తోనే ఓం రౌత్ కి శక్తిమాన్ ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది.శక్తిమాన్ ని పాన్ ఇండియా భారీ బడ్జెట్ మూవీగా వందల కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారు.ఓం రౌత్ డైరక్షన్ లో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా 2023 సంక్రాంతికి రిలీజ్ ఫిక్స్ చేసారు.

శక్తిమాన్ సినిమాలో కూడా సౌత్ స్టార్ నటిస్తాడని టాక్.అయితే అది ఎవరన్నది మాత్రం ఇంకా ఫైనల్ అవలేదు.

 అప్పటి సూపర్ హీరో సీరియల్ ని ఇప్పటి ఆడియెన్స్ ని మెప్పించేలా తెరకెక్కించడం అంటే అది మాములు విషయం కాదు.తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుందని చెప్పొచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube