తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో నయనతార అంటే తెలియని వారు ఉండరంటే పెద్ద అతిసయోక్తి కాదేమో.అంతగా ఈ బ్యూటీ ప్రేక్షకులకు దగ్గర అయ్యింది.
స్టార్ హీరోలకు ధీటుగా స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ఈ బ్యూటీ ప్రెసెంట్ వరుస లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ దూసుకు పోతుంది.లేడీ సూపర్ స్టార్ గా అభిమానుల చేత పిలుపించుకుంటూ స్టార్ హీరోలకే పోటీగా నిలుస్తుంది.
ఇక ఇటీవలే ఈ అమ్మడు పెళ్లి పీటలు కూడా ఎక్కిన విషయం విదితమే.కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్, నయనతార ప్రేమించుకుని ఇటీవలే పెళ్లితో ఒక్కటయ్యారు.
వీరి పెళ్ళికి సంబంధించిన పెళ్లి ఫోటలు నెట్టింట ఓ రేంజ్ లో వైరల్ అయిన విషయం తెలిసిందే.వీరి జంటను ఆశీర్వదించేందుకు అన్ని ఇండస్ట్రీల ప్రముఖులు, బంధు మిత్రులు హాజరయ్యారు.
ఇది ఇలా ఉండగా ఈమె పెళ్ళికి ముందు చాలా సినిమాలను ఓకే చేసింది.ఆ ప్రాజెక్టులను పూర్తి చేస్తూనే ఇప్పుడు మరొక కొత్త ప్రాజెక్ట్ ను ప్రకటించింది.
ఈమె కెరీర్ లో ఇప్పటికే 74 సినిమాలను చేయగా ఇప్పుడు తన బెంచ్ మార్క్ సినిమాను గ్రాండ్ గా ప్రకటించింది.తన కెరీర్ లో 75వ సినిమాను ఈ రోజు అఫిషియల్ గా భారీ లెవల్లో ప్రకటించారు.

ఒక గ్రాండ్ వీడియోతో ఈ బెంచ్ మార్క్ సినిమా మాసివ్ అప్డేట్ ను ఇచ్చారు.ప్రముఖ నిర్మాణ సంస్థ అయినా జీ స్టూడియోస్ బ్యానర్ వారు నయనతార 75వ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ కాబోతుండగా.అగ్ర డైరెక్టర్ శంకర్ శిష్యుడు నీలేష్ కృష్ణా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.అలాగే జై మరియు సత్యరాజ్ లు ఈ సినిమాలో మెయిన్ మేల్ లీడ్ గా నటిస్తున్నట్టు తెలిపారు.కొత్త సినిమా అనౌన్స్ మెంట్ తో నయనతార ఫ్యాన్స్ ఖుషీగా ఉన్నారు.







