మనలో అనేకమంది చేస్తున్న పొరపాటే ఇది.కొన్ని సార్లు మీ డబ్బు పొరపాటును ఓ రాంగ్ బ్యాంక్ అకౌంట్ కు బదిలీ చేసినప్పుడు చాలా కంగారు పడతారు.
అకౌంట్ నంబర్‌లో ఒక్క అంకె తప్పుగా వేసినా కూడా అది భారీ మూల్యాన్ని మిగిల్చవచ్చు.అయితే ఇక్కడ చాలామందికి ఆ డబ్బులు ఎలా తిరిగి డబ్బులు పొందాలో అర్థం కాదు.
అయితే తప్పుడు డిటైల్స్ వలన మన అకౌంట్‌లో డబ్బులు కట్ అయిపోతే తిరిగి పొందడానికి కొన్ని మార్గాలున్నాయి.అయితే ఇక్కడ తెలుసుకోవలసినది ఏమిటంటే, ఎవరి అకౌంట్ కు డబ్బు పోయిందో ఆ సదరు బ్యాంకు ఆమోదించకపోతే మాత్రం ఆ డబ్బును తిరిగి పొందడం ఒకింత కష్టమే.
అనేక రూపాల్లో ఇలాంటి తప్పులు దొర్లవచ్చు. అకౌంట్ నంబరు, IFSC కోడ్ రాయడంలో పొరపాటు కూడా మిమ్మల్ని నష్టపరుస్తుంది.బ్యాంకులో ఏదైనా సాంకేతిక లోపం ఉంటే, అప్పుడు కూడా డబ్బు తప్పుడు అకౌంట్ కు వెళ్లే అవకాశం కలదు.రాంగ్ అకౌంట్ కు డబ్బు బదిలీ అయితే, వెంటనే బ్యాంక్ బ్రాంచ్‌కు కాల్ చేసి మేనేజర్‌తో ముందుగా మాట్లాడాలి.
డబ్బు తప్పుడు అకౌంట్ లోకి వెళ్లిందని నిరూపించడానికి తగిన ఆధారాలను బ్యాంకుకు ఇవ్వాల్సి ఉంటుంది.త్వరిత చర్య కోసం మీ ఫిర్యాదును బ్యాంక్‌కి ఇమెయిల్ చేయాలి.
తప్పు అకౌంట్ కు డబ్బు బదిలీ అయినప్పుడు బ్యాంకు కేవలం మధ్యవర్తి పాత్రను మాత్రమే పోషిస్తుందనే విషయం అర్ధం చేసుకోండి.
అయితే ఒకే బ్యాంక్‌కి చెందిన 2 వేర్వేరు అకౌంట్ ల మధ్య తప్పు బదిలీ జరిగితే, ఆ లావాదేవీని రద్దు చేయడానికి బ్యాంక్ అభ్యర్థనను పంపవచ్చు.డబ్బు బదిలీ చేయబడిన బ్యాంక్ అకౌంట్ రివర్సల్‌ను అనుమతించినట్లయితే, అది తిరిగి చెల్లించబడుతుంది.7 పని దినాలలోపు డబ్బు వాపసు చేసే అవకాశం కలదు.వేరే బ్యాంకుకు నగదు బదిలీ అయితే ఆ శాఖకు వెళ్లి బ్యాంకు అధికారులను కలవాల్సి ఉంటుంది.డబ్బులు పొరపాటున పంపిన అకౌంట్ వేరే బ్యాంక్‌కు చెందినది అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందులు తప్పువని అర్ధం చేసుకోండి.
ఇక ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి బ్యాంకులు కనీసం రెండు నెలల టైమ్ తీసుకుంటాయి.







