బాలీవుడ్ స్టార్ హీరో కొత్త పెళ్లికొడుకు రణ్‌బీర్ కపూర్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.అదేవిధంగా ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు రణ్‌బీర్ నటించిన బ్రహ్మాస్త్ర, షంషేరా సినిమాలు పూర్తి అవ్వడంతో ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీబిజీగా ఉన్నాడు.
ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్లలో చురుకుగా పాల్గొంటున్న ఈ హీరో తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ప్లూయెన్సర్ డాలీ సింగ్‌తో జరిపిన చిట్‌చాట్‌లో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.గణితం ఎంచుకుంటావా? సామాన్య శాస్త్రం ఎంచుకుంటావా? అని అడగ్గా అకౌంట్స్ అని బదులిచ్చాడు రణ్‌బీర్.
వెంటనే చదువుల్లో వీకా? అని అడగ్గా చాలా వీక్ అంటూ సమాధానం ఇచ్చారు.పదవ తరగతిలో ఎన్ని మార్కులు వచ్చాయని ప్రశ్నించగా 53.4% వచ్చిందని ఏ మాత్రం ఆలోచించకుండా చెప్పాడు.ఏంటీ? అంత తక్కువా? అని డాలీ ఆశ్చర్యపోగా.అప్పుడు రణ్‌బీర్ మాత్రం తాను పాసైనందుకు ఇంట్లోవాళ్లు పార్టీ ఏర్పాటు చేశారని వెల్లడించాడు.ఎందుకంటే తన కుటుంబంలో ఇంతవరకు ఎవ్వరూ పదో తరగతి పాసైన దాఖలాలు లేవని, దీంతో తాను ఆమాత్రం మార్కులు తెచ్చుకుంటానని కూడా ఇంట్లోవాళ్లు ఊహించలేదు అని చెప్పు కొచ్చాడు రణ్‌బీర్.

అయితే తనకు వచ్చినది యావరేజ్ మార్కులే అయినప్పటికీ మా ఇంట్లో పది పాసైన మొదటి వ్యక్తిని తానే అని చెప్పు కొచ్చాడు రణ్‌బీర్.కాగా రణ్‌బీర్ కపూర్ ఓ ఇంటర్వ్యూలో తన తండ్రి 8, అంకుల్ 9, తాతయ్య 6వ తరగతి ఫెయిల్ అయినట్లు కూడా వెల్లడించాడు.రణ్‌బీర్ కపూర్, అలియా భట్ గత కొంతకాలంగా ప్రేమించుకుంటూ ఇటీవల మూడుముళ్ల బంధంతో ఒకటైన విషయం తెలిసిందే.అంతేకాకుండా ఆలియా భట్ ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా తెలిసిందే.







