నిఖిల్ సిద్దార్థ్ తన టాలెంట్ తో వరస హిట్లు కొట్టి మినిమమ్ గ్యారెంటీ హీరోగా నిలదొక్కుకున్నాడు.హ్యాపీ డేస్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ఈ యంగ్ హీరో తన ఖాతాలో మంచి హిట్స్ నే వేసుకున్నాడు.
ప్రెసెంట్ నిఖిల్ నటిస్తున్న సినిమాల్లో కార్తికేయ 2 కూడా ఉంది.ఈయన కెరీర్ లో కార్తికేయ సినిమా ఎంత హిట్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు.
ఇప్పుడు ఆ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ గా కార్తికేయ 2 చేస్తున్నాడు.చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా నిఖిల్ లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించింది.
సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులకు బాగా నచ్చడంతో సూపర్ హిట్ అయ్యింది.ఇక ఇప్పుడు చేస్తున్న కార్తికేయ 2 ఎలాంటి సస్పెన్స్ క్రియేట్ చేయనుంది అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.
ఇప్పటికే ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల అవ్వగా బాగా ఆకట్టు కుంది.ఇలా ఈ సినిమాపై పాజిటివ్ వైబ్స్ రావడంతో టీమ్ కూడా పక్కా హిట్ గ్యారెంటీ అని నమ్ముతున్నారు.
ఈ సినిమా వాయిదా పడబోతోంది అంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి.మరి ఈ వార్తలను నిజం చేస్తూ తాజాగా ఈ సినిమా వాయిదా వేస్తున్నట్టు స్వయంగా నిఖిల్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు.

నిఖిల్ కార్తికేయ 2 సినిమా వాయిదాను కన్ఫర్మ్ చేస్తూ తమ సినిమా జులై 22న రిలీజ్ అవ్వడం లేదని.ఈ సినిమా ఆగష్టు మొదటి వారంలో రిలీజ్ చేయబోతున్నట్టుగా చెప్పుకొచ్చాడు.అలాగే వాయిదా వేస్తున్నందుకు అందరికి క్షమాపణలు కూడా తెలిపారు.దీంతో ఈ సినిమా వాయిదా కంఫర్మ్ అయినట్టే.ఇక ఈ సినిమాలో టాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తుండగా.పీపుల్స్ మీడియా, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ పథకాలపై ఈ సినిమాను నిర్మిస్తున్నారు.







