ఒకప్పుడు తన అందం అభినయంతో ఆకట్టుకున్న సిల్వర్ స్క్రీన్ పైన సందడి చేసిన ఎంతోమంది అందాల ముద్దుగుమ్మలు కాస్త ఏజ్ మీద పడిపోవడంతో ఇక అవకాశాలు తగ్గి ఇండస్ట్రీలో కనుమరుగయ్యారు అన్న విషయం తెలిసిందే.కానీ ఇప్పుడు మాత్రం ఇక కొంచెం వయసు పెరిగాక మళ్లీ ముఖానికి రంగేసుకుని నటించేందుకు సిద్ధం అవుతున్నారు.
అదేనండి అందరి హీరోయిన్లలాగే తాము కూడా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే పోలా అనుకుంటూ మళ్లీ వెండితెరపై అలరించేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి.ఇలా ప్రస్తుతం ఎంతో మంది ఒకప్పటి క్రేజీ హీరోయిన్స్ కీలకమైన పాత్రలో నటించి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతుండగా వారెవరో తెలుసుకుందాం.
ఒకప్పుడు తన అందం అభినయంతో కుర్రకారు మతి పోగొట్టింది మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్. తన పిల్లి కళ్ళ తోనే మాయ చేసింది.అభిషేక్ బచ్చన్ తో పెళ్లి తర్వాత సూపర్ స్టార్ రజనీకాంత్ తో కలిసి నటించిన రోబో ఆమెకు చివరి సినిమా.ఇక ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మళ్లీ పొన్నియన్ సెల్వన్ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
ఇటీవల ఈ సినిమాలో ఐశ్వర్యరాయ్ పాత్రకు సంబంధించి ఫస్ట్ పోస్టర్ కూడా విడుదలైంది.

సొంత పేరు జెనీలియా అయినా తెలుగు ప్రేక్షకులకు మాత్రం హాసిని గానే గుర్తుండి పోయింది.ఎంతోమంది స్టార్ హీరోలతో నటించిన జెనీలియా పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరమైంది.పదేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ సౌత్లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
గాలి జనార్దన్ రెడ్డి తనయుడు నటిస్తున్న సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించబోతోంది.
విరాటపర్వం అనే సినిమాతో నందితాదాస్ రీ ఎంట్రీ ఇచ్చారు.2006లో కమిలి అనే సినిమాలో బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకున్న ఈమె.ఇక ఇప్పుడు పదిహేనేళ్ల తర్వాత విరాటపర్వంలో రీ ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి అని చెప్పాలి.

చిన్న చిన్న సినిమాల్లో నటించిన తన అందంతో ఎంతో మందిని కట్టిపడేసిన డస్కీ బ్యూటీ అర్చన ఇప్పుడు పాతికేళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే.ఒకప్పుడు నాగార్జున తో జోడీ కట్టి ఇక ఆయన ప్రేమలో పడిపోయి చివరికి పెళ్లి చేసుకున్న అమల సినిమాలకు దూరం అయింది.ఆ తర్వాత 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.ఇక ఇప్పుడు ఒకే ఒక జీవితం సినిమాలో శర్వానంద్ తల్లి పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.
మరి కొంతమంది సీనియర్ హీరోయిన్స్ కూడా ఇలా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారని తెలుస్తోంది.







