ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా సినిమాలలో నటిస్తున్న నటుడు విజయ్ దేవరకొండ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.అయితే విజయ్ దేవరకొండ నటించిన సినిమాలలో హిట్ సినిమాలతో పాటు ఫ్లాప్ సినిమాలు కూడా ఎక్కువగానే ఉన్నాయని చెప్పాలి.
అర్జున్ రెడ్డి గీతగోవిందం వంటి సినిమాలతో మంచి హిట్ కొట్టిన విజయ్ దేవరకొండ ఖాతాలో ఫ్లాప్ సినిమాలు కూడా ఉన్నాయి.
ఇకపోతే విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన అర్జున్ రెడ్డి సినిమా ప్రభావం అతనిపై ఎలా ఉందో అలాగే ఆయన ఫ్లాప్ సినిమాల ప్రభావం కూడా విజయ్ దేవరకొండపై ఇప్పటికీ ఉందని అందుకే ఈయన సినిమాల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.
సాధారణంగా పూరి జగన్నాథ్ ఒక సినిమా దర్శకత్వం చేశారంటే కేవలం ఐదు నెలలలో తన సినిమాను విడుదల చేస్తారు.కానీ లైగర్ విషయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.
అందుకే లైగర్ సినిమా విడుదలకు ఇంత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న లైగర్ సినిమా ఆగస్టు 25వ తేదీ విడుదల కానుంది.

ఇకపోతే పూరి జగన్నాథ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండతో జనగణమన సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉన్నారు.ఈ రెండు సినిమాలను వెంట వెంటనే విడుదల చేయాలని మేకస్ ప్లాన్ చేసినప్పటికీ పూరి జగన్నాథ్ ఓ సెంటిమెంట్ మాత్రం వీరిని ఆపుతుంది.పూరి డైరెక్షన్లో వచ్చిన సినిమా హిట్ అయితే మరో సినిమా కూడా బ్లాక్ పాస్టర్ అవుతుందని లేకపోతే డిజాస్టర్ అవుతుందని సెంటిమెంట్ ఉంది అందుకే లైగర్ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ జనగణమన సినిమా కాకుండా ఇన్ మధ్యలో శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తున్న ఖుషి సినిమాని విడుదల చేయనున్నారు.







