నా పెళ్లి గురించి మీకు ఎందుకండీ.. సీనియర్ హీరోయిన్ సీరియస్!

సాధారణంగా అమ్మాయిలకు ఎక్కడికి వెళ్లినా కూడా ఎదురయ్యే ప్రశ్న పెళ్లి ఎప్పుడు అని కేవలం సామాన్యులకు మాత్రమే కాకుండా పెద్ద పెద్ద సెలబ్రిటీలకు కూడా ఈ పెళ్లి విషయం గురించి తరచుగా ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి.హీరోయిన్లు అయితే సినీ ఇండస్ట్రీలో ఎవరితో అయినా కొంచెం క్లోజ్ గా కనిపించారు అంటే చాలు వారిద్దరి మధ్య ఏదో ఉంది అని రాసేస్తూ ఉంటారు.

 Sonakshi Sinha About Marriage Even My Parents Are Not Bothered, Sonakshi Sinha,-TeluguStop.com

అంతేకాకుండా ఆ, హీరో,హీరోయిన్ లు పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున రూమర్స్ ని సృష్టిస్తూ ఉంటారు.హీరోయిన్స్ కి అయితే ఎక్కడికి వెళ్ళినా కూడా ఇదే ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది.

ఈ క్రమంలోని కొందరు హీరోయిన్ లు చాలా కూల్ గా సమాధానం చెబుతూ ఉంటారు.ఇంకొందరు హీరోయిన్లు మాత్రం అలా పదేపదే అడిగినప్పుడు సీరియస్ అవుతూ ఉంటారు.

అలా తాజాగా పెళ్ళి విషయం గురించి బాలీవుడ్ హీరోయిన్‌ సోనాక్షి సిన్హా కు కూడా ప్రశ్న ఎదురవడంతో ఆమె చిర్రెత్తిపోయింది.అసలూ లేదు, కొసరూ లేదు.

అ‍ప్పుడే పెళ్ళి అంటున్నారేంటని విరుచుకుపడింది.ఇంట్లో వాళ్ల కన్నా జనాలకే తన పెళ్లి మీద ఎక్కువ ఆసక్తి ఉందని ఆమె వ్యాఖ్యానించింది.

కాగా ప్రస్తుతానికి తన జీవితాన్ని ప్రపంచానితో పంచుకునేందుకు రెడీగా లేనని తెలిపింది.

Telugu Bollywood, Sonakshi Sinha-Movie

అలాగే తానెప్పుడూ సినిమాల గురించే మాట్లాడినా, ఎదుటివారు మాత్రం వ్యక్తిగత విషయాలనే ఆరా తీస్తారని ఆశ్చర్యం వ్యక్తం చేసింది.పైగా అక్కడితో ఆగకుండా ఎవరికి వారే ఏదేదో ఊహించుకుని ఇష్టమొచ్చిన రూమర్లు వ్యాప్తి చేస్తారని చెప్పుకొచ్చింది.కాగా ఇది వరకు పెళ్లి విషయంలో వార్తలు వినిపించినప్పటికీ మౌనంగా ఉన్న సోనాక్షి సిన్హా తాజాగా మాత్రం ఆ విషయం పై మాత్రం తీవ్ర స్థాయిలో మండిపడింది.

కాగా సోనాక్షి ప్రస్తుతం కాకుడ, దహడ్‌ సినిమాలతో బిజీగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube