బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధిక ఆప్టే గురించి మనందరికీ తెలిసిందే.బాలీవుడ్ లో ఎన్నో సినిమాలు నటించే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న రాధిక ఆప్టే క్యారెక్టర్ డిమాండ్ చేసింది అంటే చాలు పాత్ర ఏదైనప్పటికీ చేయడానికి వెనకాడదు.
సినిమాలలో విభిన్నమైన పాత్రలను సెలెక్ట్ చేసుకుంటూ కెరిర్ పరంగా దూసుకెళుతోంది ఈ ముద్దుగుమ్మ.అయితే కొన్ని కొన్ని సార్లు రాధిక ఆప్టే బోల్డ్ నెస్ వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటుంది.
కాగా రాధిక ఆప్టే తెలుగులో బాలకృష్ణ సరసన లయన్, లెజెండ్ లాంటి సినిమాల్లో నటించిన విషయం తెలిసిందే.
అలాగే హిందీలో ప్యాడ్‌మ్యాన్, అంధాదూన్, బద్లాపూర్, గౌల్, సేక్రెడ్ గేమ్స్, ఫొరెన్సిక్ లాంటి సినిమాలలో నటించి మెప్పించిన ఆమె ప్రస్తుతం విక్రమ్ వేదా చిత్రంలో నటిస్తోంది.
సినిమాల వరకు ఓకే కానీ తన పర్సనల్ విషయాలకు చాలా దూరంగా ఉంటుంది అన్న విషయం తెలిసిందే.అయితే తాజాగా ఆమె భర్తతో కలిసి దర్శనమిచ్చిన రాధిక పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
కాగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న పలాసక్తికర విషయాలను వెల్లడించింది.ఈ క్రమంలోనే మీరు మీ భర్తతో కలిసి ఎక్కువగా ఫొటోలు దిగరు.
ఎందుకు ? అని ప్రశ్నించగా ఆ విషయం స్పందించిన రాధిక.నేను ఇక్కడ,బెన్ అక్కడ ఎప్పుడో ఓసారి కలుసుకుంటాం.
నా పని నేనే చేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంటాను.

అలాగే నా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పడం నాకు అంతగా ఇష్టముండదు అని చెప్పుకొచ్చింది రాధిక ఆప్టే.ఇక ఫొటోల విషయానికొస్తే నాకు ఫొటోలపై అంతగా అభిరుచి లేదు.ఇక నాకన్న బెన్ ఇంకా వేస్ట్.
ఫొటోలు అంటే అస్సలు కోపరేట్ చేయ్యడు.అందుకే మా పెళ్లి అయి పదేళ్లు కావోస్తున్న ఇప్పటివరకూ మా పెళ్లి ఫొటోలు కూడా లేవు.
మేము ఫ్రెండ్స్‌ను పిలిచాం, భోజనం అరేంజ్ చేశాం, మా స్నేహితుల్లో సగం మంది ఫొటోగ్రాఫర్లే.అయినా మాకు ఫొటోలు దిగేంత ఆసక్తి కలగలేదు’ అని చెప్పుకొచ్చింది.
కాగా కెరీర్ పరంగా ముంబైలో రాధిక ఆప్టే ఉంటే, ఆమె భర్త బెనెడిక్ట్ టేలర్ విదేశాల్లో ఉంటాడు.







