జనసేనలో బడా నేతలు.సీనియర్లు లేకపోవడంతో పార్టీలో జోష్ లేకుండా పోతోంది.
ఎంతసేపు పవన్, నాదేండ్ల మనోహర్ పేరు తప్పితే మరెవరూ చెప్పుకోదగ్గ నేతలు పార్టీలో లేకపోవడం ఆ పార్టీని కొంత కలవరపెట్టే అంశమే.అయితే జనసేనలో కి బడా నేతలు.
అసంతృప్తులు వస్తారనే పుకార్లు వచ్చినా ఇప్పటి వరకు అలా జరగలేదు.అయితే ప్రస్తుతం పవన్ అంటే విరుచుకుపడే మాజీ మంత్రి కొడాలి నాని ఇలాక గుడివాడలో జనసేన బోణీ కొట్టింది.
నానికి షాక్ ఇస్తూ గుడివాడలో వైసీపీ నేతలు జనసేనలో చేరారు.పార్టీ రాజకీయ వ్యవహారాల కార్యదర్శి నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేన కండువా కప్పుకున్నారు.
గుడివాడలో పాలంకి బ్రదర్స్ గా పేరున్న సారథి బాబు, మోహన్ బాబు వైసీపీని వీడి జనసేనలో చేరారు.నాదెండ్ల మనోహర్ వారిద్దరినీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీ సభ్యత్వం ఇచ్చారు.
అయితే 2019 నుంచి పాలంకి బ్రదర్స్ వైసీపీలో కొనసాగుతున్నారు.అయితే కొడాలి నాని పవన్ కల్యాణ్ పై చేస్తున్న విమర్శలను వారు సహించలేక పార్టీని వీడినట్లు వారు చెబుతున్నారు.
జనసేనలో చేరిన తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ గత ఎన్నికల్లో తాము కొడాలి నాని విజయానికి పనిచేశామని, అయితే నాని శృతి మించి చేస్తున్న వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పుకొచ్చారు.పవన్ కల్యాణ్ పై వ్యక్తిగత విమర్శలు చేయవద్దని, రాజకీయ విమర్శలు చేయమని తాము సూచించినా నాని వినిపించుకోలేదని అంటున్నారు.
అందుకే వైసీపీని వీడినట్లు పాలంకి బ్రదర్స్ చెప్పిన మాట.వీళ్ల చేరికతో జనసేన నాని ఇలాకలో బోణీ కొట్టినట్లైంది.పాలంకి బ్రదర్స్ గుడివాడలో బలమైన సామాజికవర్గానికి చెందిన వారు కావడంతో జనసేనకు కలిసి వచ్చే అంశమే.

గుడివాడలో నాని వ్యాఖ్యలను ప్రజలు చీదరించుకుంటున్నారని.ఇక వైసీపీలో ఎంతమాత్రం కొనసాగలేమని నిర్ణయం తీసుకొని బయటకు వచ్చామని పాలంకి బ్రదర్స్ చెప్పారు.జనసేనలో చేరడం ఆనందంగా ఉందని పాలంకి సారథిబాబు అన్నారు.
జనసేన పార్టీ విజయం కోసం అందరినీ కలుపుకొని పని చేస్తామని చెప్పారు.దీంతో ఎక్కడైతే పవన్ పై నాని రెచ్చిపోయి మాట్లాడేవారో అక్కడి నుంచే ఆ పార్టీ కీలక నేతలు జనసేనలో చేరడంతో జనసైనికులు హ్యాప్పీగా ఫీలవుతున్నారు.
ఇది ఆరంభం మాత్రమే ముందు ముందు చాలా మంది రావడం ఖాయమని జనసేన నేతలు చెబుతున్నారు.ఈ నేపథ్యంలోనే జనసేన ఇంకా ఎవరితో చర్చలు జరుపుతుందోనని చర్చించుకుంటున్నారు.







