పురాతన కాలం నుంచి మనుషులకు ఫైటింగ్స్ చూస్తూ ఎంజాయ్ చేయడం అలవాటయింది.ఈ క్రూరమైన ఫైటింగ్స్‌లో పైచేయి సాధించే వ్యక్తి గెలుపును తమ గెలుపుగా కొందరు భావిస్తూ ఎంజాయ్ చేస్తుంటారు.
ఓడిపోయిన వ్యక్తి ఎంత నొప్పి అనుభవించారో ఫైట్‌ను ఎంజాయ్ చేసేవారికి ఎప్పటికీ అర్థం కాదు.అయితే మూగజీవుల మధ్య జరిగే ఫైటింగ్స్‌ను కూడా కొందరు చూసి ఆస్వాదిస్తుంటారు.
అవి హింసాత్మకంగా ఉంటే చాలా మందికి నచ్చవు.ఫన్నీగా ఉంటే మాత్రం బాగా నచ్చేస్తాయి.
అయితే తాజాగా అందరికీ నచ్చే ఓ ఫన్నీ యానిమల్ ఫైటింగ్ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.ఇది చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.ఇంతకీ ఈ వీడియోలో కొట్లాట జరిగింది రెండు కుందేళ్ల మధ్య.అది కూడా జనాలు నివసించే ప్రదేశంలో! సాధారణంగా కుందేళ్లు మనిషి కంటికి కనిపించవు.
ఇవి ఎప్పుడూ మెరుపువేగంతో పరిగెడుతుంటాయి.ఇవి వేటిపైనా దాడి కూడా చేయవు.
కానీ ఈ రెండు కుందేళ్లు మాత్రం చాలా అగ్రెసివ్‌గా నడిరోడ్డులో పొట్లాటకు దిగాయి.రెండూ కూడా తమ వెనుక కాళ్ల పైన నిల్చొని ముందరి కాళ్లతో డబ్ల్యూడబ్ల్యూఈ ఫైటింగ్‌లో లాగా కొట్టుకున్నాయి.
శరవేగంగా పంచులు విసురుకుంటూ ఒక ఎమ్‌ఎమ్‌ఏ, ఒక బాక్సింగ్ గేమ్‌ను తలపించాయి.కొద్దిసేపు ఒకదాని ముఖంపై మరొకటి పిడి గుద్దులు గుద్దుకొని ఆ తర్వాత అవి పారిపోయాయి.
అయితే ఈ దృశ్యాలను అక్కడే కారులో ఉన్న ఒక వ్యక్తి తన ఫోన్ కెమెరాలో బంధించాడు.

ఈ వీడియోని తాజాగా @Buitengebieden అనే ట్విట్టర్ పేజీ షేర్ చేసింది.దీనికి ఇప్పటికే 15 లక్షలకు పైగా వ్యూస్, 70 వేల వరకు లైకులు వచ్చాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.“హమ్మో, ఈ కుందేళ్లు మామూలువి కాదు.కూసింత కూడా భయం లేకుండా నడిరోడ్డుపైనే స్ట్రీట్ ఫైట్ మొదలెట్టాయిగా” అని కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.







