మాటరాని మౌనమిది సినిమా ప్రివ్యూ షో కి విశేష స్పందన

మహేష్‌ దత్తా, శ్రీహరి ఉదయ గిరి, సోని శ్రీవాస్తవ ప్రథాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మాటరాని మౌనమిది’.ఈమద్య కాన్సెప్ట్‌ ఓరియంట్‌ చిత్రాలకు మంచి ఆధరణ లభిస్తుంది.

 Matarani Mounamidi Movie Preview Show News-TeluguStop.com

థియేట్రికల్‌ రన్‌ మరియు ఓటీటీ స్ట్రీమింగ్‌ అన్ని విధాలుగా కాన్సెప్ట్‌ ఓరియంట్‌ చిత్రాలకు ఉంటుంది.మంచి కమర్షియల్‌ ఎలిమెంట్స్ తో రూపొందిన మాటరాని మౌనమిది చిత్రం షూటింగ్ కార్యక్రమం పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.

ఈ సినిమా కు సుకు పూర్వాజ్‌ దర్శకత్వం వహించాడు.ఈ సినిమా ఆయనకు రెండవ సినిమా నే అయినా కూడా మంచి కాన్సెప్ట్‌ ను తీసుకుని తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది.

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ను త్వరలోనే విడుదల చేయబోతున్నందుకు చాలా సంతోషంగా ఉందంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు.రుద్ర పిక్చర్స్ బ్యానర్ లో ఈ సినిమా రూపొందింది.

తాజాగా రామానాయుడు ప్రివ్యూ థియేటర్ లో ఈ సినిమా ను ప్రివ్యూ వేయడం జరిగింది.చిత్ర యూనిట్‌ సభ్యులతో పాటు కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు ఈ ప్రివ్యూకు హాజరు అయ్యారు.

ప్రివ్యూ చూసిన ప్రతి ఒక్కరు కూడా చాలా సంతృప్తికరంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు.

సినిమా లోని ఇంటర్ వెల్‌ సన్నివేశం మరియు ప్ల్యాష్‌ బ్యాక్ ఎపిసోడ్స్ సినిమా కు హైలైట్ గా నిలుస్తాయనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు.

హీరో హీరోయిన్‌ లతో పాటు ప్రతి ఒక్కరు కూడా చాలా బాగా నటించారు.ఈ సినిమా లోని ప్రతి ఎపిసోడ్‌ కూడా చాలా నాచురల్‌ గా అనిపించేలా సినిమాటోగ్రపీ ఉంది అంటూ యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.

సినిమా ను ప్రివ్యూ షో వేసిన సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ “ఇది నా రెండో సినిమా.మంచి థ్రిల్లర్ ప్రేమ కథ, కథనం తో చిత్రాన్ని నిర్మించాము.

ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది.మా టీం అందరం కలసి సినిమా ని వీక్షించాము.

సినిమా చాలా బాగా వచ్చింది.మా టీం అందరం చాలా నమ్మకంగా ఉన్నాం, సినిమా ఖచ్చితంగా అందరికి నచ్చుతుంది.

త్వరలో చిత్రాన్ని విడుదల చేస్తా” అని తెలిపారు.ఈ సినిమా లోని ప్రతి పాత్ర ను కూడా సాదారణ ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యే విధంగా రూపొందించినట్లుగా మహేష్ దత్తా మరియు ఇతర నటీ నటులు అన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube