టాలీవుడ్ ఇండస్ట్రీలో ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్న హీరోలలో విజయ్ దేవరకొండ ఒకరు.పెళ్లికూతురు సినిమాతో హీరోగా విజయ్ దేవరకొండ ప్రయాణం మొదలైంది.
ఈ సినిమాతో విజయ్ సక్సెస్ ను సొంతం చేసుకోవడంతో పాటు తన మార్కెట్ ను రేంజ్ ను పెంచుకున్నారు.అర్జున్ రెడ్డి, గీతా గోవిందం, టాక్సీవాలా సినిమాలు కమర్షియల్ గా సక్సెస్ సాధించి విజయ్ మార్కెట్ ను పెంచాయి.
లైగర్ సినిమాతో విజయ్ దేవరకొండ ఆగష్టు నెలలో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.అయితే విజయ్ దేవరకొండ సక్సెస్ సీక్రెట్ ఏమిటనే ప్రశ్నకు భిన్నమైన కథలను ఎంచుకోవడమే అనే సమాధానం వినిపిస్తోంది.
విజయ్ దేవరకొండ సరికొత్త కథలను ఎంచుకోవడమే విజయ్ కు శ్రీరామరక్ష అని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.తన సినిమాలపై ప్రేక్షకుల్లో ఏ విధంగా ఆసక్తిగా పెంచాలో విజయ్ కు బాగా తెలుసు.
లైగర్ ఫస్ట్ లుక్ పోస్టర్ తో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు పెరిగిపోయాయి.లైగర్ సినిమాతో విజయ్ ఖాతాలో బ్లాక్ బస్టర్ చేరడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
పూరీ జగన్నాథ్ ఈ సినిమా రిజల్ట్ విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.

విజయ్ దేవరకొండకు జోడీగా ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటించడం గమనార్హం.కరణ్ జోహార్ సపోర్ట్ ఉండటంతో బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసే అవకాశాలు ఉన్నాయి.విజయ్ దేవరకొండ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా సంచలన విజయాలను అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.
విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఖుషి సినిమాలో నటిస్తుండగా పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో విజయ్ దేవరకొండ హీరోగా జనగణమన పేరుతో ఒక సినిమా తెరకెక్కనుంది.విజయ్ దేవరకొండ కెరీర్ విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.







