హ్యాంగోవర్ పిల్: మందుబాబులారా మీకో శుభవార్త.. ఇక మీ హ్యాంగోవర్ హుష్ కాకి!

ఇక్కడ మందు ఎవరికి అలవాటు లేదు? దాదాపుగా లేరు కదూ.ఏ సాయంత్రమో, లేదా ఏ వీకెండ్ కో చాలామంది మందు పుచ్చుకుంటూ వుంటారు.

 Hangover Pill Good News For Drinkers , Hangover Pill , Tablet , Liquor , Good-TeluguStop.com

ఎందుకంటే అది కొన్ని వత్తిళ్ళనుండి వారిని రక్షిస్తుంది అని వారి నమ్మకం.సరే, ఏదైతేనేమి గాని.

అలాంటివారికి కాస్త గ్యాప్ వస్తే చాలు.నాలుక పీకేస్తుంటుంది.

గొంతు త‌డారిపోయి, మనసు మ‌ద్యం మ‌త్తు కావాలని ఉరకలు వేస్తుంది.దాంతో వారు ఏ ఫ్రెండ్ తోనో బారుకి వెళ్లి సఫా సఫా లాగించేస్తారు.

ఇక మైకం క‌మ్మిన త‌ర్వాత కొన్ని గంట‌ల‌కు చూడాలి వారి అవ‌స్థ‌లు.హ్యాంగోవర్ త‌ల‌కెక్కి, క‌డుపులో దేవేస్తేన్న‌ట్లు, త‌ల బొప్పికట్టి గోడ‌కేసి కొట్టుకోవాల‌న్న‌ట్లు అనిపిస్తుంది వారికి.

ఏం చేస్తాం.హ్యాంగోవర్ కి వున్న లక్షణాలు అవి మరి.

అయితే అలాంటివారి గోడును విన్న స్వీడిష్ బ్రాండ్ Myrkl ‘హ్యాంగోవర్ పిల్’ని కనుగొంది.ఈ పిల్ తాజాగా UKలో అమ్మడం స్టార్ట్ చేసారు.

ఇక ఈ పిల్ అనేది హ్యాంగోవర్‌కి వ్య‌తిరేక సప్లిమెంట్‌ అన్నమాట.దీన్ని “ప్రీ-డ్రింకింగ్ పిల్” అని కూడా చెబుతున్నారు.

ఒక్క‌ మాత్ర వేసుకుంటే, ఒక గంట తర్వాత 70% ఆల్కహాల్‌ను అది విచ్ఛిన్నం చేయగలదని Myrkl త‌న ప్ర‌క‌ట‌న‌లో తాజాగా పేర్కొంది.ఉదాహరణకు, ఒక వ్యక్తి 20ml ప్యూర్‌ ఆల్కహాల్ తాగితే, కేవలం 6ml మాత్రమే రక్త ప్రవాహంలోకి ప్రవేశిస్తుంది.

Telugu Drinkers, Hangover Pill, Liquor, Swedish Myrkl, Tablet, Pre Pill-Latest N

ఇకపోతే అవి ప్ర‌స్తుతం UKలో మాత్రమే లభ్యమవుతున్నాయి.త్వరలో ఇక్కడ కూడా దొరకవచ్చును.30 పౌండ్లకు 30 మాత్రలు మాత్రమే అక్కడ దొరుకుతున్నాయి.అయితే దీని గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజలు ఈ మాత్రలను దుర్వినియోగం చేసే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.మద్యం సేవించి వాహనం నడపాలనుకునే వారు ఈ మాత్ర వేసుకోవడానికి ప్రయత్నించవచ్చ‌ని, అయితే, ఇది ఎప్పుడూ సురక్షితంగా ఉండకపోవచ్చని ప్ర‌జ‌ల‌కు విన్న‌వించారు.

కాబట్టి మద్యం ప్రియులారా… దానిని వాడకపోవడమే ఉత్తమం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube