ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా రూపొందిన ది వారియర్ సినిమా విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే వారంలో విడుదల కాబోతున్న సినిమాకు సంబంధించిన గ్రాఫిక్స్ వర్క్ మొత్తం పూర్తి అయ్యాయి.
ఫస్ట్ కాపీ రెడీ అవ్వడంతో సినిమా పై అంచనాలు భారీగా పెరిగాయి.ది వారియర్ సినిమా లో రామ్ పోలీస్ ఆఫీసర్ గా నటించడంతో ఆసక్తి మరింతగా పెరిగిందని అభిమానులు అంటున్నారు.
పైగా ఈ సినిమా లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటించడం వల్ల కూడా సక్సెస్ ఖాయం అనే అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తుంది.రామ్ సినిమాలో ఉండే ఎనర్జిటిక్ ఎలిమెంట్స్ అన్నీ కూడా ఈ సినిమాలో ఉంటాయి అనే అనే నమ్మకంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు తో పాటు తమిళంలో కూడా ఈ సినిమాను రూపొందిస్తున్నారు.అక్కడ కూడా ఒకే సారి విడుదల కాబోతున్న ఈ సినిమా బడ్జెట్ లెక్కలు కాస్త ఆశ్చర్యంగా ఉన్నాయి.
మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం నిర్మాతలు ఏకంగా 75 కోట్ల నుండి 80 కోట్ల వరకు పెట్టుబడి పెట్టారనే వార్తలు వస్తున్నాయి.అందులో నిజం ఎంత ఉంది అనే విషయాన్ని కొందరు చర్చిస్తున్నారు.
రామ్ సినిమాకు అంత పెట్టడం అంటే అవివేకం అని అంతా అనుకున్నారు.కాని అనూహ్యంగా సినిమా తెలుగు మరియు తమిళ థియేట్రికల్ మరియు నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా ఏకంగా 80 కోట్ల వరకు వచ్చాయట.
సినిమా సక్సెస్ అయితే ఖచ్చితంగా నిర్మాత లాభాలు మరింతగా పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి. రామ్ మరియు కృతి శెట్టిల మధ్య రొమాన్స్ మరియు ఆకట్టుకునే సన్నివేశాలు సినిమా పై అంచనాలు పెంచేస్తున్నాయి.
మరి ఈ భారీ స్థాయి లెక్కలను వచ్చిన వసూళ్లు బీట్ చేస్తాయా అనేది చూడాలి.