19న ఆది సాయికుమార్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తీస్ మార్ ఖాన్ విడుదల

విలక్షణ కథలను ఎంచుకుంటూ యాక్షన్ ఓరియెంటెడ్ చిత్రాలల్లో నటిస్తూ మాస్ ఆడియెన్స్ కు కూడా చేరువయ్యాడు ఆది సాయికుమార్.ఆయన తాజా చిత్రం ‘తీస్ మార్ ఖాన్’.

 Tees Maar Khan Worldwide Grand Theatrical Release On August 19th ,aadi Saikumar-TeluguStop.com

ప్రొడక్షన్ నెంబర్ 3 గా విజన్ సినిమాస్ బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త డా.నాగం తిరుపతి రెడ్డి ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.నాటకం వంటి విభిన్న కథాంశంతో కూడుకున్న చిత్రాన్ని తెరకెక్కించి ప్రేక్షకులను అలరించిన దర్శకుడు కళ్యాణ్ జి గోగణ దర్శకత్వంలో ఈ మూవీ రూపొందింది.చిత్రంలో ఆది సాయికుమార్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా.

సునీల్, పూర్ణ కీలకపాత్రలు పోషిస్తున్నారు.తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్.

ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ఈ తీస్ మార్ ఖాన్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న గ్రాండ్ గా విడుదల చేయబోతున్నామని ప్రకటించారు దర్శకనిర్మాతలు.చిత్ర ప్రమోషన్స్ లో భాగంగా రిలీజ్ చేసిన ఈ సినిమా పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై ఆసక్తి పెంచేశాయి.

అదేవిధంగా ఇటీవల విడుదల చేసిన ఈ మూవీ టీజర్ ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలు పెంచేసింది.ఈ టీజర్ లోని ప్రతి సన్నివేశం కూడా మూవీ ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆతృతను పెంచేసింది.

మనం ఆపాలనుకున్నంత పవర్ మనదగ్గరున్నా.మనం ఆపలేనంత పవర్ వాడిదగ్గరుంది అనే డైలాగ్ ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ఎంత పవర్ ఫుల్‌గా ఉండనుందో స్పష్టం చేసింది.

తీస్ మార్ ఖాన్ అంటూ ఈ వీడియోలో హీరో విభిన్న షేడ్స్ చూపించడంతో సినిమాపై హైప్ క్రియేట్ అయింది.హీరో ఎలివేషన్ సీన్స్, హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్‌తో రొమాంటిక్ సన్నివేశాలు, కామెడీ టచ్, యాక్షన్ సీన్స్ అన్నీ హైలైట్ కావడంతో ఈ టీజర్ కి రికార్డు స్థాయిలో వ్యూస్ వచ్చాయి.

ఆది సాయి కుమార్ పవర్ ఫుల్ పాత్రలో నటించిన ఈ సినిమాను హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.ఎక్కడా ఖర్చుకు వెనక్కు తగ్గకుండా భారీ బడ్జెట్ లేటాయించి ఈ సినిమాను రూపొందించారు నిర్మాతలు.

స్టూడెంట్, రౌడీ, పోలీస్ గా మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలో ఆది సాయికుమార్ నటించడం ఈ సినిమాకు మేజర్ అసెట్.ఈ చిత్రానికి సంగీతం సాయి కార్తీక్ అందించగా.

బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ చేశారు.మణికాంత్ ఎడిటర్ గా వర్క్ చేసి స్మార్ట్ అవుట్ పుట్ తీసుకొచ్చారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube