పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇటు సినిమాల్లో, అటు రాజకీయాల్లో సమాంతరంగా ఆయన ముందుకు వెళ్తున్నారు.
గతంలో ఎన్టీఆర్, చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చినప్పుడు సినిమాలకు గుడ్‌బై చెప్పారు.అయితే పవన్ మాత్రం స్వల్ప విరామం మాత్రమే తీసుకుని రెండు పడవల మీద కాళ్లు వేసి నడిపిస్తున్నారు.
అయితే రానున్నది ఎన్నికల కాలం కావడంతో సినిమాల కంటే రాజకీయాలతోనే ఎక్కువగా గడుపుతున్నారు.
సాధారణంగా పవన్ కనిపిస్తేనే ఆయన అభిమానులు ఊగిపోతుంటారు.
ఆయన అడుగు బయటకు పెడితే అభిమానులకు పండగే.రోడ్లన్నీ కిక్కిరిపోతుంటాయి.
పవన్‌ను చూసేందుకు వేలాదిగా తరలి వస్తుంటారు.అందుకే ఆయన సభలకు ఇసుక వేస్తే కిందకు రాలనంత జనం కనిపిస్తుంటారు.
అయితే ఆ అభిమానం ఓట్ల రూపంలో ఉంటుందా అంటే ఆ ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి.

పవన్ కళ్యాణ్ తాజాగా తన ట్విట్టర్ కామన్ డీపీ మార్చారు.జనసేన జెండా బ్యాక్ డ్రాప్‌లో నిల్చొని కోపం, ఆవేశం మేళవింపుగా ఉన్న ఫోటోని ట్విట్టర్ డీపీగా పెట్టుకున్నారు.పవన్ డీపీ మార్చగానే సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఇండియా వైడ్‌గా పవన్ కళ్యాణ్ ఫోటో, యాష్ ట్యాగ్ ట్రెండ్ కావడం విశేషం.సాధారణంగా హీరోలు హీరోయిన్లు తరచూ తమ ప్రొఫైల్ డీపీలు మారుస్తుంటారు.
అయితే పవన్ తన ట్విట్టర్ డీపీ మార్చక దాదాపు నాలుగేళ్లు అవుతోంది.అయితే ఆయన ఇప్పుడే డీపీ ఎందుకు మార్చారన్నది చర్చనీయాంశంగా మారింది.
అయితే తన కదలికతో జనసైనికులను ప్రభావితం చేయాలన్నది పవన్ ఆలోచనగా ఉందని పలువురు భావిస్తున్నారు.ప్రస్తుతం జనవాణి కార్యక్రయం నిర్వహిస్తూ క్షేత్రస్థాయిలో ప్రజలతో పవన్ మమేకం అవుతున్నారు.
అలాగే ఈ కార్యక్రమంలో జనసైనికులను భాగం చేయాలన్నది కూడా పవన్ ఆకాంక్షిస్తున్నారు.దీంతో సోషల్ మీడియాలో తన డీపీ మార్చి తన ఉద్దేశాన్ని గ్రహించాలని పవన్ పరోక్షంగా సంకేతాలు పంపారు.
ఈ డీపీలో పవన్ నెరిసిన జుట్టు, గుబురు గడ్డంతో సీరియస్‌గా ఉన్నట్లు కనిపిస్తోంది.







