మన టాలీవుడ్ లో ఇప్పటి వరకు చాలానే భారీ బడ్జెట్ సినిమాలు వచ్చాయి.కానీ కోలీవుడ్ మాత్రం ఇప్పటికీ 100 కోట్ల కంటే ఎక్కువ బడ్జెట్ సినిమాలు చేయడానికి ముందుకు రావడం లేదు.
అందుకే వీరు హై బడ్జెట్ సినిమాలలో వెనుకబడి పోయారని చెప్పాలి.కానీ ఇప్పుడు కోలీవుడ్ ఇండస్ట్రీ నుండి కూడా ఒక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ వస్తుంది.
అదే పొన్నియన్ సెల్వన్.
ఇండియన్ సినిమా దగ్గర ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ సినిమాను మావెరిక్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాలో చియాన్ విక్రమ్ హీరోగా కార్తీ, జయం రవి వంటి స్టార్స్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమాపై భారీ హైప్ ఏర్పడడంతో అందరు ఎలా ఉండబోతుందా అని ఎదురు చూస్తున్నారు.
ఇక ఈ సినిమా ఇటీవలే ప్రొమోషన్స్ కూడా స్టార్ట్ చేసింది.
ఈ క్రమంలోనే ఈ సినిమా నుండి టీజర్ కూడా రిలీజ్ అవ్వగా మరింత హైప్ కు చేరుకుంది.ఈ టీజర్ కు అందరి నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఇది పక్కన పెడితే ఈ సినిమా నుండి తాజాగా మరొక వార్త నెట్టింట వైరల్ అయ్యింది.

మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కోసం తనవంతు సాయం అందించడానికి కమల్ హాసన్ ముందుకు వచ్చినట్టు తెలుస్తుంది.ఈ సినిమా కోలీవుడ్ లోనే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కావడంతో ఇలాంటి సినిమాలకు వాయిస్ ఓవర్ కూడా హైలెట్ అవుతుంది.మరి ఈ సినిమా లోని కథను ముందుకు నడిపించడం కోసం కమల్ హాసన్ ను మేకర్స్ ఒప్పించినట్టు తెలుస్తుంది.
ఈ సినిమా మొత్తానికి వాయిస్ ఓవర్ అందించడానికి కమల్ కూడా ఒప్పుకోవడంతో ఈయన క్రేజ్ కూడా సినిమాకు యాడ్ అయ్యి మరింత మైలేజ్ ఇచ్చింది అనే చెప్పాలి.







