సీఎం జగన్ పై నాగబాబు సీరియస్ వ్యాఖ్యలు..!!

ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ “జనవాణి” కార్యక్రమం నిర్వహించడం తెలిసిందే.ఈ కార్యక్రమంలో ప్రజల దగ్గర నుండి అర్జీలు తీసుకుంటూ వైసీపీ ప్రభుత్వం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.

 Nagababu Satires On Ap Cm Jagan Details, Nagababu, Ap Cm Jagan, Janasena Party,-TeluguStop.com

ముఖ్యంగా ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో ముద్దుల మామయ్య అంటూ వెటకారంగా సీఎం జగన్ నీ పవన్ విమర్శించడం జరిగింది.ఇప్పుడు ఇదే తరహాలో జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు నాగబాబు.

కూడా ముద్దుల మామయ్య అంటూ సీఎం జగన్ పై సెటైర్లు వేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 8వేల పాఠశాలలు మూసివేయడం ద్వారా ముద్దుల మామయ్య “అమ్మ ఒడి”ని తప్పించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారా అంటూ అనుమానం వ్యక్తం చేశారు.

లేకపోతే ఉపాధ్యాయ ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం లేకుండా చేయటానికి అంటూ ప్రశ్నించారు.ఈ ప్రశ్నలకు కచ్చితంగా వైసీపీ సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఒక్క అనంతపురం జిల్లాలోనే 711 పాఠశాలలు మూతపడ్డాయని మరి అక్కడ ఉన్న పిల్లల భవిష్యత్తు ఏంటి అంటూ నాగబాబు సీరియస్ కామెంట్స్ చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube