తండ్రితో వైరం.. తనయుడితో స్నేహం.. బాబు రాజకీయం అంటే ఇదే..!!

రాజకీయాల్లో చంద్రబాబు గురించి, ఆయన రాజకీయ చతురత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఆనాడు టీడీపీని కాపాడుకోవడానికి ఎన్టీఆర్ నుంచి పార్టీ పగ్గాలను తీసుకున్నారు.

 Quarrel With Father Friendship With Son Chandra Babu's Politics Is This. Andhra-TeluguStop.com

కానీ ఇప్పటికీ ఆ చర్యను వెన్నుపోటు అంటూ వచ్చే ఆరోపణలను చంద్రబాబు ఎదుర్కొంటున్నారు.ఆనాడు చంద్రబాబు పార్టీని తీసుకోకపోతే ఈరోజు టీడీపీ ఉండేది కాదనే విషయం ఆ పార్టీ అభిమానులందరికీ తెలుసు.చంద్రబాబు రాజకీయ చతురత, వ్యూహాలతోనే రెండు సార్లు అధికారంలోకి వచ్చారు.1999, 2014 ఎన్నికల్లో మరోసారి సీఎంగా ఆయన్ను ప్రజలు ఎన్నుకున్నారు.చిన్నప్పటి నుంచి రాజకీయాలపై ఆసక్తి ఉన్న చంద్రబాబు కాలేజీ రోజుల్లో ఆర్ధిక శాస్త్రం చదివారు.దీంతో ఆయన ఎంతో శోధించి రాజకీయాలపై పట్టు సాధించారు.చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు.చంద్రబాబు రాజకీయ జీవితం ప్రారంభమైన సమయంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా విద్యార్ధి నాయకుడిగా తన నాయకత్వ లక్షణాలకు పదును పెట్టారు.బాబు పొలిటికల్ ఎంట్రీ నాటికి చిత్తూరు జిల్లాలో తలపండిన నేతలు చాలా మంది ఉండేవారు.

ముఖ్యంగా నల్లారి అమర్నాథ్‌రెడ్డి ఆనాడు రాజకీయాల్లో తలపండిన నేతగా పేరు తెచ్చుకున్నారు.1962లోనే అమర్నాథ్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి నెగ్గేశారు.అయితే వయసు సరిపోదన్న కారణంతో ఆయన ఎన్నికను న్యాయస్థానం రద్దు చేసింది.అనంతరం నాలుగు సార్లు వాయల్పాడు నుంచి ఎదురులేని ఎమ్మెల్యేగా గెలిచారు.మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకటరామిరెడ్డి హయాంలలో మంత్రివర్గంలో కూడా పనిచేశారు.అంతటి తలపండిన నేతనే కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే చంద్రబాబు ఢీకొట్టారు.

Telugu Amarnadh Reddy, Andhra Pradesh, Ap Poltics, Chandrababu, Handrababu, Kish

అమరనాధ్ రెడ్డి మరణించాక ఆయన పెద్ద కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డి 1989లో పాలిటిక్స్‌లో ఎంట్రీ ఇచ్చారు.ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2011లో ఉమ్మడి ఏపీకి చివరి సీఎంగా కూడా చేశారు.అయితే జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చాక కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు మధ్య లోపాయికార ఒప్పందం జరిగిందని అప్పట్లో ప్రచారం జరిగింది.రాష్ట్ర విభజన తర్వాత నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి సోదరుడు నల్లారి కిషోర్‌కుమార్ రెడ్డి టీడీపీలో చేరారు.2014, 2019లో పీలేరు నుంచి పోటీ చేసిన కిషోర్ ఓటమి పాలయ్యారు.అయినా 2024లో మరోసారి ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు అని చెప్పడానికి ప్రస్తుతం నల్లారి, నారా కుటుంబాల మధ్య సాన్నిహిత్యమే అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube