ఈమధ్య వచ్చిన విరాటపర్వం సినిమాతో నటన పరంగా మెప్పించినా కమర్షియల్ గా సక్సెస్ అందుకోలేని సాయి పల్లవి ఈసారి గార్గి అనే మరో ప్రయోగాత్మక సినిమాతో వస్తుంది.ఈ సినిమాకు సంబందించిన ట్రైలర్ లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.
ఈ ట్రైలర్ విషయానికి వస్తే ఓ స్కూల్ టీచర్ గా పనిచేస్తున్న గార్గి తండ్రిని పోలీసులు అరెస్ట్ చేస్తారు.అతను ఎక్కడ ఉన్నాడో తెలియదు.
అతన్ని విడిపించడానికి ఆమె చేసిన ప్రయత్నమే గార్గి సినిమా కథ.
గౌతం రామచంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమా తమిళంతో పాటుగా తెలుగు, మళయాళ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది.సినిమా ట్రైలర్ చూసిన సినీ ప్రేక్షకులు, సాయి పల్లవి అభిమానులు ఈ సినిమాతో తమ అభిమాన నటి పక్కా హిట్ కొడుతుందని అంటున్నారు.నటనలో ఆమెని మించిన వారు లేరని ఆ విషయం గార్గితో మరోసారి ప్రూవ్ అవుతుందని సాయి పల్లవి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
కమర్షియల్ సినిమాలు చేసి హీరోయిన్ గా క్రేజ్ ఎవరైనా తెచ్చుకుంటారు కానీ ఇలాంటి ప్రత్యేకమైన సినిమాలు చేస్తేనే నటిగా గుర్తించబడతారని కొందరు అంటున్నారు.

విరాటపర్వం నిరాశపరచడంతో సాయి పల్లవి ఇక మీదట ప్రయోగాల జోలికి వెళ్లదని అనుకుంటే పొరపాటే.స్టార్ సినిమాల్లో హీరోయిన్ గా ఎవరైనా చేస్తారు కానీ ఇలాంటి సినిమాలు చేయాలంటేనే సాయి పల్లవి లాంటి నటీమణులు కావలి.గార్గితో అయినా సాయి పల్లవి కమర్షియల్ సక్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి.
ఈ సినిమా జూలై 15న సౌత్ అన్ని భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సినిమా మీద సాయి పల్లవి చాలా హోప్స్ పెట్టుకుంది.మరి సాయి పల్లవి ఫ్యాన్స్ ఈసారైనా ఆమెని బాక్సాఫీస్ విజేతగా నిలిచేలా చేస్తారో లేదో చూడాలి.







