టీడీపీ కీలక నేత చింతమనేని ప్రభాకర్ కోసం తెలంగాణ పోలీసులు గాలింపులు..!!

టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కోసం తెలంగాణ పోలీసులు గాలిస్తున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది.తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు లో పటాన్ చెరు ప్రాంతాలలో చింతమనేని మరికొంతమంది కోడి పందాలు నిర్వహిస్తున్నట్లు.

 Telangana Police Are On The Lookout For Tdp Key Leader Chintamaneni Prabhakar De-TeluguStop.com

పోలీసులకు సమాచారం రావడంతో బుధవారం రాత్రి దాడులు చేయడం జరిగింది.ఇంతలో పోలీసుల రాక తెలుసుకొని అక్కడనుండి చింతమనేని పరారైనట్లు సమాచారం.

దీంతో ఆయనను పట్టుకోడానికి తెలంగాణ పోలీసులు గాలింపులు చేపట్టినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో కోడి పందాలు జరిగే ప్రాంతాలలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్టు.100 కోళ్లను, 10 లక్షల రూపాయల నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగిందట.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చాక చింతమనేని పై చాలా కేసు నమోదు అయ్యాయి.

జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చింతమనేని అరెస్టు కావడం జైలుకు కూడా వెళ్లడం తెలిసిందే.అయితే తాజాగా చింతమనేని ప్రభాకర్ తెలంగాణ రాష్ట్రంలో కోడిపందాలు నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని ఆయనను పట్టుకోవడానికి తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగినట్లు వార్తలు రావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube