మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు నరేష్, నటి పవిత్ర లోకేష్ ల వ్యవహారం చిలకి చిలికి గాలి వానగా మారింది.గత వారం రోజులుగా వీరి పేర్లు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మారుమోగుతున్నాయి.
వీరిద్దరి మధ్య ఏదో సంబంధం ఉంది అంటూ వస్తున్న వార్తలపై నరేష్ మూడో భార్య రమ్య రఘుపతి స్పందించడంతో ఆ వ్యవహారం కాస్త మరింత పెద్దది అయింది.ఈ వ్యవహారంతో సినిమాల ద్వారా నరేష్ సంపాదించుకున్న పరువు మొత్తం గంగలో కలిసిపోయేటట్లు అయింది.
అయితే ఈ వ్యవహారంలో నిజాలు గురించి పక్కన పెడితే అభిమానులకు నరేష్ పై ఉన్న అభిమానం చచ్చిపోయింది అని చెప్పవచ్చు.
నరేష్ పదే పదే తన వ్యక్తిత్వం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటూ భార్యల్ని మార్చే ప్రక్రియలో వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు.
ఇదిలా ఉంటే ఇటీవల జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్,నరేష్ వ్యక్తిత్వం చాలా గొప్పదంటూ పొగడ్తలు కురిపించడంతో ఆ వీడియోపై ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది.ఇటీవల పవన్ కళ్యాణ్ హీరో నాని నటించిన అంటే సుందరానికీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వచ్చిన పవన్.
నరేష్ గురించి మాట్లాడుతూ నరేష్ అంటే తనకి చాలా ఇష్టమని, గౌరవమని.ఆయనది గొప్ప వ్యక్తిత్వం అంటూ తెగ పొగిడేశారు పవన్.

అయితే నరేష్, పవన్ ఇద్దరు సినిమాల్లోకి రాకముందు నుంచి ఇద్దరికి పరిచయం ఉండి అని చెన్నైలో పక్క పక్కనే ఉండేవాళ్లం అని ఆయన వ్యక్తిత్వం చాలా బలమైనది ఆయన నటన కూడా అద్భుతంగా ఉంటుంది అంటూ ప్రశంసలు వర్షం కురిపించారు పవన్ కళ్యాణ్.అయితే ఇప్పుడు నరేష్ ముగ్గురు భార్యల వ్యవహారం రచ్చకెక్కడంతో.పవన్ కళ్యాణ్ ఆ వ్యక్తిత్వాన్ని పొగుడుతూ మాట్లాడిన మాటలపై ట్రోలింగ్ చేస్తూ ఆ వీడియోని తెగ వైరల్ చేస్తున్నారు.పవన్ నరేష్ గురించి మాట్లాడిన మాటలను స్పందిస్తూ.
సరిపోయారు ఇద్దరికిద్దరూ.అంటూ భార్యల విషయంలో ఇటు పవన్, అటు నరేష్‌లను ట్రోల్ చేస్తున్నారు వైసీపీ శ్రేణులు.







